Monday, 13 April 2020

అత్యవసర సేవల కోసం పాస్‌లు జారీ చేస్తున్న ఏపీ పోలీసులు..ఎలా అప్లయ్ చేయాలంటే..?

అత్యవసర సేవల కోసం పాస్‌లు జారీ చేస్తున్న ఏపీ పోలీసులు..ఎలా అప్లయ్ చేయాలంటే..?

లాక్‌డౌన్ సందర్భంగా అత్యవసర సేవలను వినియోగించుకునేందుకు తెలంగాణ ప్రభుత్వం బాటలోనే ఏపీ ప్రభుత్వం పయనిస్తోంది. అత్యవసర సమయంలో ప్రయాణించాల్సి వచ్చినప్పుడు ప్రజలు ఇబ్బందులకు గురవుతున్నారనే విషయం తమ దృష్టికి వచ్చిందని ఏపీ డీజీపీ కార్యాలయం పేర్కొంది. అలాంటి వారికోసం ఎమర్జెన్సీ పాసులను జారీ చేస్తామని ఏపీ డీజీపీ ఆఫీస్ పేర్కొంది. లాక్‌డౌన్‌తో ప్రజలు ఇబ్బందులు పడకూడదనే ఈ పద్ధతిని తీసుకొచ్చినట్లు ఏపీ పోలీస్ శాఖ పేర్కొంది.


ఇక అత్యవసర పాసుల కోసం ఎలా దరఖాస్తు చేసుకోవాలో పోలీస్ శాఖ వివరించింది. ఎమర్జెన్సీ పాస్ ఎందుకు తీసుకోవాలనుకుంటున్నారో అనేదానిపై స్పష్టమైన కారణం చెప్పాలని పోలీస్ శాఖ స్పష్టం చేసింది.
పాసులు కావాలనుకునే వారు పేరు, పూర్తి చిరునామా, ఆధార్ కార్డు వివరాలు, ప్రయాణించే వారి వాహనం నెంబరు, ఎంతమంది ప్రయాణికులు ప్రయాణిస్తున్నారో అనే సంఖ్య, ఎక్కడి నుంచి ఎక్కడి వరకు ప్రయాణిస్తున్నారో లాంటి వివరాలను పొందుపర్చాల్సి ఉంటుందని అధికారులు చెప్పారు. ఇలాంటి వివరాలన్నీ అందజేస్తే సరైన కారణం ఉందని అనిపిస్తే వెంటనే పాసుల జారీ ప్రక్రియను పోలీసులు ప్రారంభిస్తారని ఆ శాఖ పేర్కొంది.

ఇక ఎమర్జెన్సీ పాసులు కావాలనుకునే వారు తాము ఉంటున్న ప్రదేశంకు సంబంధించి పైన ఇచ్చిన వివరాలను ఆయా జిల్లా ఎస్పీల వాట్సాప్‌ నెంబర్‌ లేదా మెయిల్‌ ఐడీకి అనుమతి కోరుతూ అప్లయ్‌ చేయాల్సి ఉంటుంది. దీనికి సంబంధించిన ఎస్పీల వాట్సాప్ నెంబర్లు, మెయిల్ ఐడీల వివరాలను డీజీపీ కార్యాలయం విడుదల చేసింది. ఇక మీరు చూపించే కారణాలు సరిగ్గా ఉంటే వెంటనే మీ మొబైల్ నెంబరుకు పాస్ వివరాలను పంపిస్తారు.అయితే జిల్లా ఎస్పీల వాట్సాప్ నెంబరు లేదా మెయిల్ ఐడీ నుంచి వచ్చిన పాసులు మాత్రమే చెల్లుతాయని వెల్లడించింది డీజీపీ కార్యాలయం. ఫార్వర్డ్ చేసిన పాసులు అనుమతులు ఎట్టిపరిస్థితుల్లో చెల్లుబాటు కావని ఒకవేళ ఎవరైనా అలాంటివి చూపిస్తే చర్యలు తీసుకుంటామని పోలీస్ శాఖ హెచ్చరించింది.

0 comments:

Post a Comment

Recent Posts