Thursday, 16 April 2020

గురువుకు నిర్వచనం.. ఆయన జీవితం ఓ స్ఫూర్తి పాఠం.. నేడు సర్వేపల్లి రాధాకృష్ణన్ వర్ధంతి !

గురువుకు నిర్వచనం.. ఆయన జీవితం ఓ స్ఫూర్తి పాఠం.. నేడు సర్వేపల్లి రాధాకృష్ణన్ వర్ధంతి !
డా. సర్వేపల్లి రాధాకృష్ణన్ భారతదేశపు మొట్టమొదటి ఉపరాష్ట్రపతి మరియు రెండవ రాష్ట్రపతి. భారతీయ తాత్వికచింతనలో పాశ్చాత్య తత్వాన్ని ప్రవేశ పెట్టారని ప్రతీతి. రెండు పర్యాయాలు ఉపరాష్ట్రపతి పదవి చేపట్టి, తరువాత రాష్ట్రపతిగా ఒక పర్యాయం పదవిని చేపట్టి, భారతదేశపు అత్యంత క్లిష్టకాలంలో ప్రధానులకు మార్గనిర్దేశం చేశారు


సర్వేపల్లి రాధాకృష్ణన్ 5-9-1888న మద్రాసుకు ఈశాన్యంగా 64 కి.మీల దూరమున ఉన్న తిరుత్తణిలో సర్వేపల్లి వీరస్వామి, సీతమ్మ దంపతులకు జన్మించాడు. వీరాస్వామి ఒక జమీందారీలో తహసిల్దార్. వారి మాతృభాష తెలుగు. వృత్తి రీత్యా, వ్యక్తిత్వ రీత్యా, సంస్కార రీత్యా సర్వేపల్లి ఎంతో ఉత్తముడు. స్వశక్తితో అసాధారణ ప్రఙ్ఞా పాటవాలతో ఉన్నత శిఖరాలకు ఎదిగి పలువురికి మార్గదర్శకంగా, తన వృత్తి ధర్మానికి మకుటంగా వెలిగారు. సర్వేపల్లి బాల్యం, విద్యాభ్యాసం ఎక్కువగా తిరుత్తణి, తిరుపతిలోనే గడిచిపోయాయి. ప్రాథమిక విద్య తిరుత్తణిలో సాగింది. తిరుపతి, నెల్లూరు, మద్రాసు క్రిస్టియన్ కాలేజీ మున్నగుచోట్ల చదివి ఎం.ఏ పట్టా పొందాడు. బాల్యం నుండి అసాధారణమైన తెలివితేటలు కలవాడాయాన.

1906లో 18 సంవత్సరాల చిరుప్రాయంలో శివకామమ్మతో వివాహం జరిగింది. వీరికి ఐదుగురు కూతుళ్ళు, ఒక కుమారుడు కలిగారు. 21 సంవత్సరాలైనా దాటని వయసులో ఆయన మద్రాసు ప్రెసిడెన్సీ కాలేజీలో ప్రొఫెసర్ అయ్యాడు. ఆయన నాలుగు దశాబ్దాల పాటు ఉపాధ్యా వృత్తిలో ఉండి విద్యార్థుల మధ్యనే గడిపారు. ఎదుటివారికి బోధించటం వల్ల తన విజ్ఞానం కూడా వృద్ధి చెందుతుందని మనసా వాచా నమ్మిన వ్యక్తి సర్వేపల్లి. కష్టమైన అంశాన్ని కూడా విద్యార్థులకు అతి సులభంగా బోధించేవారాయన. ఉపాధ్యాయుడి బాధ్యత ఎప్పుడూ గురుతరమైనదే. తత్వశాస్త్రంలో అతని ప్రతిభను విని మైసూరు విశ్వవిద్యాలయం అతనిని ప్రొఫెసర్‌గా నియమించింది.

ఆయన ఉపన్యాసాలను ఎంతో శ్రద్ధగా వినేవారు విద్యార్థులు. సర్వేపల్లి ప్రతిభ గుర్తించిన డాక్టర్ అశుతోష్ ముఖర్జీ, రవీంద్రనాథ టాగూర్.. కలకత్తా విశ్వవిద్యాలయ ఆచార్య పదవి చేపట్టమని ఆయణ్ని కోరారు. వారి ఆహ్వానం మేరకు ఆయన అక్కడికి వెళ్లారు. అక్కడే ఆయన కీర్తి దశదిశలా వ్యాపించింది. 1931లోనే రాధాకృష్ణన్ 'లీగ్ ఆఫ్ నేషన్స్', 'ఇంటలెక్చ్యుయల్ కో-ఆపరేషన్ కమిటీ' సభ్యులుగా ఎన్నికయ్యారు. 1936లో ఆక్స్‌ఫర్డ్ యూనివర్సిటీలో ప్రాచ్యమతాల గౌరవాధ్యపకులయ్యారు. 1967లో రాష్ట్రపతి పదవీ విరమణ చేసిన తర్వాత డాక్టర్ సర్వేపల్లి మద్రాసులోని తన సొంత ఇంటికి వెళ్లిపోయారు. చివరి రోజుల్లో తాత్విక చింతన చేస్తూ గడిపారు. 1975 ఏప్రిల్ 17న ఆయన తుదిశ్వాస విడిచారు.


0 comments:

Post a Comment

Recent Posts