ఏపీలో కరోనా నమోదైన ప్రాంతాలివే
ఏపీలో రోజు రోజుకీ కరోనా బాధితుల సంఖ్య పెరిగిపోతోంది. ఇప్పటిదాకా 190 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా.. ఆ మహమ్మారి ఎక్కడ సోకుతుందోనని సగటు మనిషి ఆందోళన చెందుతున్నాడు. కరోనా బాధితులు, వారి కుటుంబ సభ్యులు ఉన్న ప్రాంతాలను పోలీసులు రెడ్ జోన్‌గా ప్రకటించి అటువైపు ఎవ్వరూ వెళ్లకుండా చర్యలు తీసుకుంటున్నారు. అయితే మరింత పౌరులకు మరింత అవగాహన కల్పించాలనే ఉద్దేశంతో ఏపీలో ఇప్పటి వరకు నమోదైన బాధితుల జాబితాలో పేషెంట్ నెంబర్ 41 నుంచి పేషంట్ నెంబర్ 130 వరకు గల వ్యక్తుల నివాస స్థలాల వివరాలను ఏపీ ప్రభుత్వం విడుదల చేసింది. దీనివల్ల సామాన్య జనం ఆయా ప్రాంతాలవైపు వెళ్లకుండా జాగ్రత్త పడే అవకాశముంది.
0 comments:
Post a Comment