Sunday, 5 April 2020

ఏపీలో 05/04/2020 6'o Clock కరోనా పాజిటివ్‌ కేసుల బులెటిన్‌

కర్నూలు జిల్లాలో 53కి చేరిన పాజిటివ్‌ కేసులు



అమరావతి: ఏపీలో కరోనా పాజిటివ్‌ కేసుల సంఖ్య మరింత పెరిగింది. రాష్ట్ర వ్యాప్తంగా 252 కేసులు నమోదైనట్లు వైద్య ఆరోగ్యశాఖ ప్రకటించింది. 

ముఖ్యంగా కర్నూలు జిల్లాలో తాజాగా ఈరోజే మరో 26 కేసులు కొత్తగా నమోదయ్యాయి. దీంతో ఆ జిల్లాలో కేసుల సంఖ్య 53కి చేరింది. ఈరోజు ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు నమోదైన కొవిడ్‌-19 పరీక్షల్లో తాజా కేసులు నిర్ధారణ అయినట్లు రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ వెల్లడించింది.


నిన్న రాత్రి నుంచి ఈ ఉదయం 9 గంటల వరకు నమోదైన పరీక్షల్లో 34 కేసులు నిర్ధారణ కాగా.. అందులో కర్నూలు జిల్లా నుంచే 26 ఉన్నాయి. తాజాగా విడుదల చేసిన బులెటిన్‌లో అదే జిల్లాలో మరో 26 పాజిటివ్‌ కేసులు బయటపడిన నేపథ్యంలో ప్రభుత్వం సూచనలతో జిల్లా యంత్రాంగం అప్రమత్తమైంది.

ఇప్పటికే కేసులు నిర్ధారణ అయిన ప్రాంతాలను కంటైన్‌మెంట్‌ జోన్లుగా ప్రకటించింది. ఆయా ప్రాంతాల్లో రెండు రోజులపాటు నిత్యావసరాలను సైతం నిలిపివేయనున్నారు. కంటైన్‌మెంట్‌ జోన్లుగా ప్రకటించిన నేపథ్యంలో ఆయా చోట్ల ఎవర్నీ బయటకు రానీయకుండా నిర్బంధించే అవకాశముంది

0 comments:

Post a Comment

Recent Posts