టీశాట్‌లో పదో తరగతి సిలబస్ ప్రసారాల షెడ్యూల్ వివరాలు
పరీక్షల సమయంలో విద్యార్థులకు ఒక్క నిమిషం కూడా ఎంతో విలువైనదే.అలాంటి విలువైన సమయం వృద్ధాకాకుండా విద్యార్థుల కోసం టీవీల్లో, ఆన్ లైన్ లో పాఠాలు ప్రసారాలు చేయిస్తుంది ప్రభుత్వం. పదో తరగతి పరీక్షలు రాసే విద్యార్ధులను మొదలుకుని, కాంపిటేటివ్ పరీక్షలు రాసే విద్యార్థుల వరకు ఈ ఆన్ లైన్ బోధనా తరగతులు వరంగా మారాయి.
ముఖ్యంగా టీశాట్ ప్రసారంచేస్తున్న పాఠాలు టెన్త్ విద్యార్థులకు ఎంతో ఉపయోగపడుతున్నాయి. లాక్‌డౌన్ సమయంలో విద్యార్థులు ఒక్క నిమిషం కూడా వృథాచేయకుండా ఉండేందుకు రోజుకు రెండు సబ్జెక్టులు టీశాట్ లో బోధిస్తున్నారు. తరగతులను ఉదయం 10 నుంచి 11 వరకు, సాయంత్రం 4 నుంచి 5 గంటల వరకు పాఠాలను ప్రసారంచేస్తున్నారు.
టీశాట్‌లో ప్రసారాలషెడ్యూల్ వివరాలు:
ఏప్రిల్ 16వ తేదీన గణితం, భౌతిక శాస్త్రంలను బోధించనున్నారు. గణితంలో రేఖాచిత్ర పద్ధతి, రెండు చరరాశుల్లో రేఖీయ సమీకరణాల సాధన, సరూప త్రిభుజాలు- ప్రాథమిక అనుపాత సిద్ధాంతం అభ్యాసాలను బోధించనున్నారు. భౌతికశాస్త్రంలో రసాయన సమీకరణాలు, కాంటం సంఖ్యలు, తుల్యంచేయడం పాఠాలు బోదించనున్నారు.
ఏప్రిల్ 17వ తేదీలో భౌతిక శాస్త్రం, సాంఘీలక శాస్త్రం పాఠాలను బోధించనున్నారు. భౌతిక శాస్త్రంలో ఆమ్లక్షార బలాలు, ఆమ్లాలు క్షారాలు, పీహెచ్ విలువ.
సాంఘీక శాస్త్రంలో భారతదేశం నదులు, భారతదేశం శీతోష్ణస్థితి, నీటి వనరులు, భారతదేశం భౌతిక లక్షణాలు పాఠాలు బోధిస్తారు.
ఏప్రిల్ 18వ తేదీన గణితం, జీవశాస్త్రం, ఆంగ్లం సబ్జెక్టులు చెప్పనున్నారు. గణింతంలో తిభుజం అభ్యాసం.
జీవశాస్త్రంలో రక్తప్రసరణ వ్యవస్థ, గుండె అంతర్గత స్వరూపం.
ఆంగ్లంలో సోషల్ ఇష్యూస్, డిస్కోర్స్ కన్‌స్ట్రక్షన్ అండ్ ఎడిటింగ్ న్యూస్‌రిపోర్ట్ టాపిక్ లపై చర్చిస్తారు.
ఏప్రిల్ 19వ తేదీన భౌతిక శాస్త్రం, సాంఘీక శస్త్రం సబ్జెక్టుల్లోని పాఠాలు బోధిస్తారు.
భౌతికశాస్త్రంలో లవణాలు, గోళాకార దర్పణాలు- కాంతికిరణ చిత్రాలు, దర్పణసూత్రం, ఉత్పాదన
సాంఘీక శాస్త్రంలో వలసపాలిత ప్రాంతాల్లో జాతివిముక్తి ఉద్యమాలు, ప్రపంచయుద్ధాలు, మొదటి ప్రపంచయుద్ధం 1914-18, రాంపురం గ్రామ ఆర్థికవ్యవస్థ టాపిక్ లను బోధిస్తారు.
ఏప్రిల్ 20వ తేదీన జీవశాస్త్రం, ఇంగ్లీష్, సాంఘీక శాస్త్రం సబ్జెక్టులను చెప్పనున్నారు.
ఆంగ్లంలో రెండెజోస్ విత్ రే రీడింగ్, బయో డైవర్సిటీ.
సాంఘికశాస్త్రంలో భారత స్వాతంత్య్ర రాజ్యాంగ రూపకల్పన -1.
జీవశాస్త్రంలో నోరు ఒక నమిలే యంత్రం, మానవుడు విసర్జక వ్యవస్థ టాపిక్ లను చర్చిస్తారు.
ఏప్రిల్ 21వ తేదీన గణితం, జీవశస్త్రం సబ్జెక్టులను బోధిస్తారు. జీవశాస్త్రంలో మానవుడిలో శ్వాసవ్యవస్థ, ఏకవలయ ద్వివలయకర్త ప్రసరణ, మానవ జీర్ణవ్యవస్థ.
గణితంలో స్వరూప త్రిభుజాల నిర్మాణం, సమితులపై పరిక్రియలు పాఠాలు బోధిస్తారు.
ఏప్రిల్ 22వ తేదీన ఆంగ్లం, భౌతిక శాస్త్రం సబ్జెక్టులు. ఆంగ్లంలో ఎన్విరాన్‌మెంట్ రీడింగ్-ఏ, మైచైల్డ్ హుడ్ రీడింగ్- ఏ.
భౌతికశాస్త్రంలో హౌటు ఫైండ్ రిఫ్రాక్టివ్ ఇండెక్స్ ఆఫ్ ప్రిజం ఈ టాపిక్ లు చర్చిస్తారు.
ఏప్రిల్ 23వ తేది గణితం, భౌతిక శాస్త్రం, జీవశాస్త్రం లను బోధిస్తారు. జీవశాస్త్రంలో క్షీరదాల్లో (మానవులు) లైంగిక ప్రత్యుత్పత్తి, రుచి, వాసన, జీవుల్లో అలైంగిక ప్రత్యుత్పత్తి, ఆకలి, మొక్కల్లో శ్వాసక్రియ.
గణితంలో సంభావ్యత,
భౌతికశాస్త్రంలో నాభ్యంతరం, గోళాకార దర్పణాల,పదజాల వివరణ టాపిక్ లను బోధిస్తారు.
0 comments:
Post a Comment