Wednesday, 15 April 2020

PhonePe: ఫోన్‌పే యూజర్లకు గుడ్ న్యూస్... కొత్త ఫీచర్స్ వచ్చాయి

PhonePe: ఫోన్‌పే యూజర్లకు గుడ్ న్యూస్... కొత్త ఫీచర్స్ వచ్చాయి.
మీరు ఫోన్‌పే యాప్ ఉపయోగిస్తున్నారా? ఫోన్‌పే యాప్‌తో రీఛార్జ్‌, బిల్ పేమెంట్స్ చేస్తున్నారా? మరిన్ని కొత్త ఫీచర్స్‌ని యూజర్ల కోసం రూపొందించింది ఫోన్‌పే. ప్రస్తుతం కరోనా వైరస్ లాక్‌డౌన్ కొనసాగుతోంది.

 అత్యవసరమైతే తప్ప ఇళ్లలోంచి బయటకు వెళ్లలేని పరిస్థితి. నిత్యావసర వస్తువులు తెచ్చుకోక తప్పదు.

ఇందుకోసం ఫోన్‌పే కొత్త ఫీచర్ రూపొందించింది. యాప్‌లో స్టోర్స్ సెక్షన్ ఓపెన్ చేస్తే మీకు రెండు కొత్త ఫిల్టర్స్ కనిపిస్తాయి. 'కరెంట్లీ ఆపరేషనల్', 'హోమ్ డెలివరీ' పేరుతో మీరు ఆ ఫిల్టర్స్ చూడొచ్చు. 'కరెంట్లీ ఆపరేషనల్' అంటే తెరిచి ఉన్న షాపుల వివరాలు మీకు కనిపిస్తాయి. మీరు 'హోమ్ డెలివరీ' ఫిల్టర్ అప్లై చేస్తే ఇంటికి సరుకులు తీసుకొచ్చి ఇచ్చే షాపుల వివరాలు కనిపిస్తాయి

స్థానిక కిరాణా షాపులతో కలిసి ఫోన్‌పే యూజర్లకు ఈ సేవలు అందిస్తోంది. మీరే వెళ్లి సరుకులు తెచ్చుకోవాలనుకుంటే షాపులు ఎక్కడ తెరిచి ఉన్నాయో తెలుసుకొని వెళ్లొచ్చు. మీరు వెళ్లకుండా సరుకులు కావాలనుకుంటే హోమ్ డెలివరీ ఎంచుకోవచ్చు. లాక్‌డౌన్ సమయంలో మీరు నిత్యావసర వస్తువుల కోసం ఇబ్బందులు పడకుండా ఈ ఫీచర్ ఉపయోగపడుతుంది. తెరిచి ఉన్న షాపులతో పాటు, హోమ్ డెలివరీ చేసే స్టోర్స్ వివరాలు యాప్‌లోనే చూడొచ్చు. స్టోర్స్ పేజ్‌లోనే 'పే నౌ' ఫీచర్ కూడా ఉంటుంది. మీరు క్యూఆర్ కోడ్ స్కాన్ చేయాల్సిన అవసరం లేకుండా 'పే నౌ' క్లిక్ చేసి పేమెంట్ చేయొచ్చు.

0 comments:

Post a Comment

Recent Posts