PM Kisan: రైతుల అకౌంట్‌లోకి డబ్బులు... స్టేటస్ చెక్ చేయండిలా
భారతదేశంలోని రైతులను ఆదుకోవడం కోసం కేంద్ర ప్రభుత్వం ప్రధాన మంత్రి కిసాన్ సమ్మాన్ నిధి పథకాన్ని ప్రారంభించిన సంగతి తెలిసిందే. రైతులకు ఏటా రూ.6,000 మూడు వాయిదాల్లో చెల్లించడమే ఈ పథకం లక్ష్యం. రూ.2,000 చొప్పున ఏడాదిలో మూడు సార్లు రైతుల అకౌంట్‌లో జమ చేస్తోంది కేంద్ర ప్రభుత్వం. అయితే కరోనా వైరస్ సంక్షోభం కారణంగా అనేక వర్గాలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నందున ఇటీవల కేంద్ర ప్రభుత్వం 'పీఎం గరీబ్ కళ్యాణ్' పథకాన్ని ప్రారంభించిన సంగతి తెలిసిందే. రైతులకు కిసాన్ సమ్మాన్ నిధిలో భాగంగా రూ.2,000 వెంటనే బదిలీ చేస్తామని ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రకటించారు. మే నెలలో రావాల్సిన మొదటి విడత డబ్బుల్ని ఏప్రిల్‌లోనే విడుదల చేసింది కేంద్ర ప్రభుత్వం.
మరి లబ్ధిదారుల జాబితాలో మీ పేరు ఉందో లేదో, మీ అకౌంట్‌లోకి డబ్బులు జమ అయ్యాయో లేదో తెలుసుకోండి.
ముందుగా పీఎం కిసాన్ అధికారిక వెబ్‌సైట్.
https://pmkisan.gov.in/ ఓపెన్ చేయండి.
https://pmkisan.gov.in/ ఓపెన్ చేయండి.
Farmers corner సెక్షన్‌లో Beneficiary Status క్లిక్ చేయండి. కొత్త పేజీ ఓపెన్ అవుతుంది.
అందులో ఆధార్ నెంబర్ / బ్యాంక్ అకౌంట్ నెంబర్ / మొబైల్ నెంబర్ ఆప్షన్లలో ఏదో ఒకటి ఎంచుకోండి.
నెంబర్ ఎంటర్ చేసి Get Data పైన క్లిక్ చేయండి.
మీరు లబ్ధిదారుల జాబితాలో ఉన్నారో లేదో, అకౌంట్‌లో డబ్బులు జమ అయ్యాయో లేదో స్టేటస్ తెలుస్తుంది.నేరుగా ఇక్కడ క్లిక్ చేసి పీఎం కిసాన్ స్టేటస్ తెలుసుకోవచ్చు.
Sir tag line mistake undi correct cheyandi
ReplyDeleteSharing is the Symbol of friendship and Pease(Peace) wrong rasaru (santhi)