Sunday, 31 May 2020

ఈ యాప్ ద్వారా పీఎఫ్ డబ్బులు విత్‌డ్రా చేసుకో0డి

పీఎఫ్ అకౌంట్ ఉన్న వారు అత్యవసర సమయాల్లో డబ్బు ముందుగానే విత్‌డ్రా చేసుకోవచ్చు. పీఎఫ్ అకౌంట్‌ నుంచి డబ్బులు విత్‌డ్రా చేసుకోవడానికి చాలా ఆప్షన్లు అందుబాటులో ఉన్నాయి.

నేరుగా ఈపీఎఫ్‌వో ఆఫీస్‌కు వెళ్లి పీఎఫ్ డబ్బులు విత్‌డ్రా చేసుకోవచ్చు. లేదంటే ఆన్‌లైన్‌లో ఈపీఎఫ్‌వో పోర్టల్‌కు వెళ్లి డబ్బులను విత్‌డ్రా చేసుకునే ఆప్షన్ ఉంది. పీఎఫ్ డబ్బులు తీసుకోవడానికి ఇంకొక ఆప్షన్ కూడా అందుబాటులో ఉంది. అదే ఉమాంగ్ యాప్. ఉమాంగ్ యాప్ ద్వారా కూడా పీఎఫ్ డబ్బులను విత్‌డ్రా చేసుకోవచ్చు. ఈపీఎఫ్‌వో ఆఫీస్ దూరంగా ఉన్నప్పుడు, లేదంట పర్సనల్ కంప్యూటర్ అందుబాటులో లేనప్పుడు ఈ ఆప్షన్ ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది. ఉమాంగ్ యాప్ ద్వారా మీరు పీఎఫ్ డబ్బులు విత్‌డ్రా చేయాలని భావిస్తే..

కొన్ని విషయాలు గుర్తించుకోవాలి. కేవైసీ వివరాలు వెరిఫై అయ్యి ఉండాలి. యూఏఎన్ నెంబర్ ఆధార్‌తో లింక్ అవ్వాలి. అలాగే ఉమాంగ్ యాప్ కూడా ఆధార్‌తో లింక్ అయ్యి ఉండాలి.


ఫోన్ నెంబర్ ఆధార్‌తో అనుసంధానమై ఉండాల్సిందే. ముందుగా ఉమాంగ్ యాప్‌ను ఫోన్‌లో ఇన్‌స్టాల్ చేసుకోవాలి. దీని కోసం గూగుల్ ప్లేస్టోర్‌కు వెళ్లి యాప్‌ను డౌన్‌లోడ్ చేయాలి. ఉమాంగ్ యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకున్న తర్వాత లాగిన్ అవ్వాలి.

తర్వాత ఈపీఎఫ్‌వో ఆప్షన్ ఎంచుకోవాలి. మీకు ఈపీఎఫ్‌వో ఆప్షన్ కనిపించకపోతే సెర్చ్ మెనూలోకి వెళ్లి ఈపీఎఫ్‌వో అని టైన్ చేస్తే ఆప్షన్ కనిపిస్తుంది. ఓపెన్ చేయండి. ఇప్పుడు ఎంప్లాయీ సెంట్రిక్‌ ఆప్షన్‌పై క్లిక్ చేయండి.

రైజ్ క్లెయిమ్ ఆప్షన్ ఎంచుకోండి. ఇప్పుడు మీ ఈపీఎఫ్ యూఏఎన్ నెంబర్ ఎంటర్ చేయాలి. తర్వాత మీ ఫోన్‌కు ఓటీపీ వస్తుంది. దీన్ని కూడా ఎంటర్ చేసి ఓకే చేయాలి. పీఎఫ్ డబ్బులు ఎందుకోసం విత్‌డ్రా చేస్తున్నారనే ఆప్షన్ ఓకే చేసి సబ్‌మిట్ చేయాలి. తర్వాత పీఎఫ్ విత్‌డ్రా క్లెయిమ్ రెఫరెన్స్ నెంబర్ మీ మొబైల్ నెంబర్‌కు వస్తుంది. దీని సాయంతో క్లెయిమ్ స్టేటస్ చెక్ చేసుకోవచ్చు.   


 Click here to Download app

0 comments:

Post a Comment

Recent Posts