Friday, 29 May 2020

జూన్ 1 నుంచి కొత్త ఐటీ ఫామ్-26ఏఎస్

*🌺New tax rule: ఆస్తి, షేర్ల వివరాలు సహా... జూన్ 1 నుంచి కొత్త ఐటీ ఫామ్-26ఏఎస్🌺*

*🌺 ఆదాయపు పన్ను (ఐటీ) శాఖ గురువారం సవరించిన ఫామ్ 26ఏఎస్‌ను నోటిఫై చేసింది. సమగ్ర పన్నుల సమాచారం కోసం ఐటీ డిపార్టుమెంట్ సవరించిన ఈ ఫాంను అందుబాటులోకి తెస్తోంది.*

*🌺పన్ను చెల్లింపుదారులు ఒక ఆర్థిక సంవత్సరంలో జరిపే ఆస్తుల అమ్మకం, కొనుగోళ్లు, షేర్ మార్కెట్ ట్రాన్సాక్షన్స్‌కు సంబంధించిన వివరాలు, వాటికి సంబంధించి చెల్లించే మూలంలో పన్ను కోత (TDS), మూలం వద్దే పన్ను వసూలు వంటి వివరాలు ఈ ఫామ్‌లో ఉంటాయి.*



*🌺1. ఫామ్ 26ఏఎస్‌లో ఆస్తి, షేర్ల ట్రాన్సాక్షన్స్ వివరాలు మూలం వద్ద పన్ను వసూలు లేదా మినహాయించిన (TDS nsoe TCS) వివరాలను కలిగి ఉండే ఫామ్ 26ఏఎస్‌ను ఐటీ శాఖ సవరించి, నోటిఫై చేసింది.*

*🌺టీడీఎస్ లేదా టీసీఎస్ వివరాలతో పాటు ఓ ఆర్థిక సంవత్సరంలో చోటు చేసుకున్న నిర్దిష్ట ఆర్థిక లావాదేవీలు, పన్ను చెల్లింపులు, రీఫండ్స్ తదితరాలు ఐటీ రిటర్న్స్‌లో ఇవ్వాల్సి ఉంటుంది.*

*🌺ఇందులో ఆస్తుల కొనుగోళ్లు, విక్రయాలు, షేర్ల ట్రాన్సాక్షన్స్ వివరాలు పొందుపరుస్తారు.*

*🌺దీనిని అమలు చేసేందుకు బడ్జెట్ 2020-21లో ఆదాయపు పన్ను చట్టంలో కొత్త సెక్షన్ 285బీబీని ప్రవేశపెట్టారు.*


*🌺2. జూన్ 1వ తేదీ నుండి అమల్లోకి🌺*

*🌺సవరించి, నోటిఫై చేసిన ఈ ఫామ్ 26ఏఎస్‌ను జూన్ 1వ తేదీ నుండి అమలులోకి తీసుకు వస్తోంది ప్రత్యక్ష పన్నుల కేంద్ర బోర్డు (CBDT). ఈ మేరకు సీబీడీటీ ప్రకటించింది.*

*🌺ఫామ్ 26ఏఎస్ యాన్యువల్ కన్సాలిడేటెడ్ ట్యాక్స్ స్టేట్‌మెంట్. పన్ను చెల్లింపుదారులు తమ పాన్ కార్డును ఉపయోగించి ఆదాయపు పన్ను శాఖ వెబ్ సైట్ ద్వారా యాక్సెస్ కావొచ్చు.*

*🌺3. మరింత సులభం🌺*

*🌺ఫామ్ 26ఏఎస్ ఇంతకుముందు చేసిన ప్రకటనలకు అనుగుణంగా మరింత సమగ్రంగా తయారు చేయబడిందని, ఇది పన్ను చెల్లింపుదారులు జరిపిన ఆర్థిక లావాదేవీలు గురించి సమాచారం కలిగి ఉంటుందని, తద్వారా ట్యాక్స్ ఫైలింగ్‌ను మరింత సులభతరం చేస్తుందని, దీని ద్వారా మరింత సమాచారం సేకరించవచ్చునని ఆదాయపు పన్ను నిపుణులు చెబుతున్నారు.*

*🌺ఫామ్ 26ఏఎస్‌లో ఏదైనా తప్పుడు సమాచారం లేదా వివరాలు ఇస్తే గుర్తించి, దిద్దుబాటుకు ఉపయోగపడుతుందని చెబుతున్నారు.*

*🌺ఫామ్ 26ఏఎస్ కొత్త రూపంలో పన్ను చెల్లింపుదారు చెల్లించే పన్నులకు సంబంధించి మరింత సమగ్ర సమాచారం ఒకే రూపంలో అందించేందుకు ఉపయోగపడుతుందని చెబుతున్నారు.*

0 comments:

Post a Comment

Recent Posts