Friday, 29 May 2020

దేశంలో ఇకపై 11 అంకెల మొబైల్‌ నంబర్లను వినియోగంలోకి సిఫార్సు చేసిన టెలికాం నియంత్రణ సంస్థ

సిఫార్సు చేసిన టెలికాం నియంత్రణ సంస్థ
ఇంటర్నెట్‌డెస్క్‌: మొబైల్‌ నంబర్ల విషయంలో టెలికాం నియంత్రణ సంస్థ (ట్రాయ్‌) కీలక ప్రతిపాదనలు చేసింది. దేశంలో 11 అంకెల మొబైల్‌ నంబర్‌ను వినియోగించాలని ప్రతిపాదించింది. పలువురితో చర్చల అనంతరం కొన్ని సిఫార్సులను శుక్రవారం విడుదల చేసింది.

దేశంలో ప్రస్తుతం 10 అంకెల మొబైల్‌ నంబర్లు ఉన్నాయి. ఇకపై 11 అంకెల మొబైల్‌ నంబర్లను వినియోగంలోకి తీసుకురావడం ద్వారా కొత్తగా నంబర్ల సంఖ్యను పెంచుకోవచ్చని ట్రాయ్‌ పేర్కొంది. మొబైల్‌ నంబర్లకు ముందు 9 అంకెను కలపడం ద్వారా అవి 11 అవుతాయి. దీంతో టెలికాం ఆపరేటర్లు కొత్తగా మరో 1000 కోట్ల మొబైల్‌ నంబర్లను వాడుకలోకి తీసుకురావచ్చని ట్రాయ్‌ పేర్కొంది.

0 comments:

Post a Comment

Recent Posts