ఏపీలో జరగనున్న ప్రవేశపరీక్షల కోసం ఆన్‌లైన్ దరఖాస్తులకు ప్రభుత్వం గడువును జూన్ 15వరకు పొడిగింపు
AP: ఏపీలో జరగనున్న ప్రవేశపరీక్షల కోసం ఆన్‌లైన్ దరఖాస్తులకు ప్రభుత్వం గడువును పొడిగించింది. లాక్ డౌన్ ను ఈ నెలాఖరు వరకు కేంద్రం పొడిగించిన క్రమంలో ఏపీలో ఎంసెట్ తో సహా ఈసెట్, ఐసెట్, ఎడ్‌సెట్, లాసెట్, పీజీ ఈసెట్, పీఈసెట్ ప్రవేశ పరీక్షల దరఖాస్తు గడువును ఉన్నత విద్యా మండలి జూన్ 15వరకు పొడిగించింది. గతంలో పొడిగించిన గడువు బుధవారం ముగియనుండటంతో.. మరోసారి పొడిగిస్తున్నట్లు ప్రకటించింది. ఎటువంటి అదనపు రుసుము లేకుండా జూన్ 15 వరకు విద్యార్థులు ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకునేందుకు అవకాశం కల్పించినట్లు అధికారులు పేర్కొన్నారు
0 comments:
Post a Comment