జూన్ 30 వరకు రైళ్లను రద్దు ఐఆర్‌సీటీసీ రీఫండ్ రూల్స్
భారతీయ రైల్వే జూన్ 30 వరకు రైళ్లను రద్దు చేసిన సంగతి తెలిసిందే. దీంతో అప్పటివరకు అన్ని రైళ్లలో టికెట్లు ఆటోమెటిక్‌గా రద్దైపోయినట్టే. ప్రయాణికులందరికీ రీఫండ్ ఇవ్వనుంది రైల్వే. అయితే కరోనావైరస్ సంక్షోభం కారణంగా టికెట్ క్యాన్సలేషన్, రీఫండ్ రూల్స్‌లో కొన్ని మార్పులు చేసింది రైల్వే. 2020 మార్చి 21 నుంచి తదుపరి ఆదేశాలు జారీ చేసే వరకు పీఆర్ఎస్ కౌంటర్ జనరేటెడ్ టికెట్స్, ఇ-టికెట్స్‌కు కొత్త రీఫండ్ రూల్స్ అమలులో ఉంటాయి. మరి ఆ రూల్స్ ఏంటో తెలుసుకోండి.
మీరు ఇ-టికెట్స్ అంటే ఐఆర్‌సీటీసీలో టికెట్ బుక్ చేసినట్టైతే ఆ టికెట్లు ఆటోమెటిక్‌గా క్యాన్సిల్ అవుతాయి. వారికి ఫుల్ రీఫండ్ లభిస్తుంది. ఈ ప్రాసెస్ అంతా ఆన్‌లైన్‌లోనే పూర్తవుతుంది.
ఒకవేళ మీరు మార్చి 21 నుంచి ఇప్పటివరకు ఎప్పుడైనా ఇ-టికెట్లు క్యాన్సిల్ చేసినట్టైతే క్యాన్సలేషన్ ఛార్జీలను ఐఆర్‌సీటీసీ డిడక్ట్ చేసి ఉంటుంది. మీరు ఆ క్యాన్సలేషన్ ఛార్జీలను కూడా రీఫండ్ రూపంలో పొందొచ్చు. ఇందుకోసం అప్లై చేయాల్సి ఉంటుంది. మీరు రైలు టికెట్లు బుక్ చేసేప్పుడు ఉపయోగించిన క్రెడిట్, డెబిట్, కార్డులు, అకౌంట్లు, వ్యాలెట్లలోకే రీఫండ్ వస్తుంది. అంటే మీరు టికెట్ బుకింగ్ సమయంలో పేటీఎం వ్యాలెట్ ఉపయోగించినట్టైతే తిరిగి పేటీఎం వ్యాలెట్‌లోకే రీఫండ్ డబ్బులు వస్తాయి.
ఇక ఇప్పటివరకు మీ టికెట్లను మీరు క్యాన్సిల్ చేయకపోతే వాటిని రద్దు చేయకపోవడమే మంచిది. మీరు టికెట్ క్యాన్సిల్ చేస్తే క్యాన్సలేషన్ ఛార్జీలు వర్తించే అవకాశముంది. గతంలో ఈ సమస్య వచ్చింది. దీంతో ఆ ప్రయాణికులు మళ్లీ క్యాన్సలేషన్ ఛార్జీల రీఫండ్ కోసం దరఖాస్తు చేయాల్సి వచ్చింది. అందుకే ఐఆర్‌సీటీసీ మీ టికెట్లు క్యాన్సిల్ చేసే వరకు వెయిట్ చేయండి. ఒకేసారి లక్షలాది రైలు టికెట్లు రద్దు అయ్యాయి కాబట్టి రీఫండ్ ప్రాసెస్‌కు కాస్త సమయం తీసుకుంటుంది. రీఫండ్ రాకపోతే కంగారుపడాల్సిందేమీ లేదు. టికెట్లు క్యాన్సిల్ అయిన 4 నుంచి 7 రోజుల్లో రీఫండ్ అకౌంట్‌లో జమ అవుతుంది.మీరు పీఆర్ఎస్ కౌంటర్‌లో టికెట్ తీసుకున్నారా? అయితే మీ ప్రయాణ తేదీ నుంచి ఆరు నెలల లోపు ఎప్పుడైనా రీఫండ్ పొందొచ్చు. ఆ ప్రయాణికులు రైల్వే స్టేషన్‌లు టికెట్ డిపాజిట్ రిసిప్ట్-TDR ఫైల్ చేయాల్సి ఉంటుంది. గతంలో 10 రోజులు ఉన్న నిబంధనను 60 రోజులకు పెంచింది. 60 రోజుల్లో సీసీఓ లేదా సీసీఎం క్లెయిమ్ ఆఫీసుల్లో డీటెయిల్డ్ టీడీఆర్ ఫైల్ చేయాలి. వెరిఫికేషన్ తర్వాత రీఫండ్ లభిస్తుంది. పీఆర్ఎస్ కౌంటర్‌లో టికెట్లు తీసుకున్న ప్రయాణికులు 139 రైల్ సంపర్క్ ఎస్ఎంఎస్ సర్వీస్ ద్వారా రైలు టికెట్లు క్యాన్సిల్ చేయొచ్చు. ప్రయాణికులు బుక్ చేసుకున్న అన్ని టికెట్ల పైనా ఫుల్ రీఫండ్ వస్తుంది. రీఫండ్ విషయంలో ప్రయాణికులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. ఒకవేళ క్యాన్సలేషన్ ఛార్జీలు డిడక్ట్ అయినా తిరిగి రీఫండ్ పొందొచ్చు.

0 comments:
Post a Comment