*దేశంలో మే 31 వరకు లాక్ డౌన్ 4.0 పొడిగింపు*
*ఆర్థిక కార్యకలాపాలు కొనసాగించేందుకు వీలుగా కేంద్రం మినహాయింపులు*
ఆర్టీసీ బస్సులు, స్థానిక రవాణాపై రాష్ట్ర ప్రభుత్వాలకే నిర్ణయాధికారం
జోన్లలో అనుసరించాల్సిన విధివిధానాలపైనా రాష్ట్ర ప్రభుత్వాలకు స్వేచ్ఛ
రాష్ట్రాలకు పూర్తి అధికారం ఇవ్వాలని, కేంద్రం నిబంధనలతో రాష్ట్రాలు నష్టపోతున్నాయని సీఎంలు చేసిన ఫిర్యాదుతో వెసులుబాటు ఇచ్చిన కేంద్రం
దేశ వ్యాప్తంగా కరోనా తీవ్ర స్థాయికి చేరుతున్న సమయంలో నియంత్రణ చర్యల విషయంలో రాష్ట్రాలు కఠినంగా ఉండాల్సిందేనన్న కేంద్రం
*కరోనా కేసుల విషయంలో ఉదాసీనంగా వ్యవహరించే రాష్ట్రాలపై కఠినంగా వ్యవహరించేందుకు వెనుకాడబోమని కేంద్రం సంకేతం*
బహిరంగ ప్రదేశాల్లో భౌతికదూరం పాటించేలా కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవాలని రాష్ట్రాలకు కేంద్రం దిశానిర్దేశం
స్కూళ్లు, కాలేజీలు, మాల్స్, సినిమా హాళ్ల విషయంలో ఎలాంటి మార్పు ఉండబోదన్న కేంద్రం!
🚩లాక్‌డౌన్ 4.0 మార్గదర్శకాలు ఇవే..*
*న్యూఢిల్లీ:* దేశవ్యాప్తంగా మే 31 వరకు లాక్‌డౌన్ పొడిగించిన కేంద్రం తాజాగా నాలుగో విడత లాక్‌డౌన్ మార్గదర్శకాలు విడుదల చేసింది. రాత్రి 7 గంటల నుంచి ఉదయం 7గంటల వరకు దేశవ్యాప్తంగా కర్ఫ్యూ యథావిధిగా కొనసాగుతుందని కేంద్రహోంశాఖ తెలిపింది. కంటైన్మెంట్, రెడ్, గ్రీన్, ఆరెంజ్ జోన్లపై నిర్థయాధికారం రాష్ట్రాలకే అప్పగించింది. కరోనా హాట్‌స్పాట్స్ కేంద్రాల్లో ఆంక్షలు మరింత కఠినంగా అమలు చేయాలని కేంద్రం ఆదేశించింది. కంటైన్మెంట్‌జోన్లలో అత్యవసర సర్వీసులకు మాత్రమే అనుమతి ఉంటుందని స్పష్టం చేసింది. అంతర్రాష్ట బస్సు సర్వీసులకు షరతులతో కూడిన అనుమతులు మంజూరు చేసింది. 65ఏళ్లు దాటినవారు, గర్బిణీ మహిళలు, 10 ఏళ్ల లోపు చిన్నారులు ఇళ్లలోనే ఉండాలని కేంద్రం సూచించింది.
*నూతన మార్గదర్శకాలు..*
కాలేజీలు, స్కూళ్లకు మే 31వరకు అనుమతి లేదు
సినిమా థియేటర్లు, దేవాలయాలు మూసివేత కొనసాగింపు
హోటళ్లు, రెస్టారెంట్లపై నిషేధం
రాజకీయ, సామాజిక సభలపై నిషేధం కొనసాగింపు
మెట్రో రైళ్లు, విద్యా, శిక్షణ సంస్థలు మే 31 వరకు బంద్
దేశీయ, అంతర్జాతీయ ప్రయాణికుల విమాన సర్వీసులు బంద్
స్విమ్మింగ్ పూల్స్, జిమ్‌లు, మే 31వరకు బంద్
ఆర్టీసీ బస్సులు, స్థానిక రవాణాపై రాష్ట్ర ప్రభుత్వాలదే నిర్ణయం
అంత్యక్రియలకు 20 మందికి మాత్రమే అనుమతి
భౌతిక దూరం పాటిస్తూ 50 మంది అతిథులతో పెళ్లిళ్లకు అనుమతి
అన్ని రాష్ట్రాల మధ్య వైద్యులు, నర్సులు, వైద్య సిబ్బంది ప్రయాణానికి అనుమతి

Click here to download proceedings
0 comments:
Post a Comment