Thursday 14 May 2020

గంటకు 500 మంది శ్రీవారి దర్శనానికి భక్తుల అనుమతి

కరోనా మహమ్మారి వ్యాప్తిని అరికట్టేందుకు దేశంలో లాక్‌డౌన్ అమలుచేస్తోంది కేంద్రప్రభుత్వం. గత 50 రోజులకు పైగా యావత్ భారతావని గడపదాటకుండా లక్ష్మణ రేఖ గీసుకుని కూర్చుంది. చివరకు ఆలయాలు, ప్రార్థనా మందిరాలు కూడా మూసివేశారు. 

ప్రసిద్ధ పుణ్యక్షేత్రం తిరుమల తిరుపతి దేవస్థానం కూడా మూసివేయటంతో భక్తులకు శ్రీవారి దర్శనం కరువైపోయింది. స్వామివారి నిత్య కైంకర్యాలు మాత్రం యథావిధిగా నిర్వహిస్తన్నారు ఆలయ అర్చకులు. ఈ క్రమంలోనే ప్రస్తుతం లాక్‌డౌన్ -4లో తిరుమల వెంకన్న భక్తులకు దర్శనాలకు అనుమతించే దిశగా టీటీడీ కార్యాచరణ సిద్ధం చేసింది.


భక్తులను శ్రీవారి దర్శనానికి అనుమతించడంపై టీటీడీ కసరత్తు పూర్తి చేసింది.
ప్రతిరోజు 14 గంటల పాటు శ్రీవారి దర్శనానికి అనుమతి ఇవ్వనుండగా..గంటకు 500 మంది భక్తులను మాత్రమే అనుమతించేలా టీటీడీ ప్రణాళికలు రూపొందించింది. 
ప్రయోగాత్మకంగా 15 రోజుల పాటు దర్శనానికి అనుమతి
మొదటి మూడు రోజులు టీటీడీ అధికారులకు దర్శనభాగ్యం కల్పించనుండగా.. తర్వాత తిరుమల, తిరుపతిలో ఉన్న స్థానికులకు అనుమతించేలా టీటీడీ అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు.

0 comments:

Post a Comment

Recent Posts