6 నెలల మారటోరియం ఆప్షన్ ఎంచుకుంటే 6 లక్షల నష్టం
రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా-RBI ఈఎంఐ మారటోరియంను మరో మూడు నెలలు పొడిగిస్తూ గుడ్ న్యూస్ చెప్పింది. అయితే మారటోరియం ఆప్షన్ ఎంచుకుంటే లాభమా నష్టమా అన్న చర్చ చాలాకాలంగా ఉన్నదే. లోన్ చెల్లించడానికి డబ్బులు లేక ఆర్థిక ఇబ్బందులు ఉన్నవారే మారటోరియం ఆప్షన్ ఎంచుకోవాలి. డబ్బులు ఉన్నా బ్యాంకు అవకాశం ఇచ్చింది కదా అని మారటోరియం ఎంచుకుంటే భారీగా నష్టపోవాల్సిందే. మొదట మూడు నెలల మారటోరియం ఆప్షన్ ఇచ్చినప్పుడు 25 శాతం మంది లోన్ కస్టమర్లు ఈ ఆప్షన్ ఎంచుకుకున్నారని అంచనా. ఇప్పుడు మరో మూడు నెలల ఈఎంఐ మారటోరియంను ఎంతమంది ఎంచుకుంటారో ఇప్పుడే చెప్పలేం. అయితే మారటోరియం వల్ల నష్టం తప్ప లాభం లేదని గతంలో అనేక ఉదారహణలు చూశాం.
తప్పని పరిస్థితుల్లోనే మారటోరియం ఎంచుకోవాలి. ఈఎంఐ చెల్లించడానికి డబ్బులు ఉన్నా మారటోరియం ఎంచుకుంటే అదనంగా డబ్బులు చెల్లించక తప్పదు. ఎలాగో మనీకంట్రోల్ వివరించిన ఓ ఉదాహరణ చూద్దాం.
ఓ వ్యక్తి రెపో లింక్డ్ వడ్డీ రేటుతో 2020 జనవరిలో 8% వడ్డీకి రూ.45,00,000 హోమ్ లోన్ తీసుకున్నారని అనుకుందాం. టెన్యూర్ 300 నెలలు ఎంచుకుంటే నెలకు రూ.34,732 చొప్పున ఈఎంఐ చెల్లించాలి. లోన్ ముగిసే నాటికి మొత్తం వడ్డీ రూ.59,19,519 చెల్లించాల్సి ఉంటుంది. ఇటీవల ఆర్‌బీఐ రెపో రేట్‌ను భారీగా తగ్గించింది. దీంతో వడ్డీ రేటు 6.85% అయింది. ఈఎంఐ రూ.34,732 కొనసాగించడం వల్లే టెన్యూర్ 239 నెలలకు దిగొచ్చింది. వడ్డీ రూ.37,70,792 కి దిగొచ్చింది. లోన్ తీసుకున్నప్పుడు వడ్డీ రూ.59,19,519 కాగా ఇప్పుడు వడ్డీ రూ.37,70,792. అంటే రూ.21,48,727 ఆదా అయింది. ఇప్పుడు అదే వ్యక్తి 6 నెలల మారటోరియం ఆప్షన్ ఎంచుకుంటే ఎంత నష్టమో తెలుసుకుందాం. 6 నెలలు మారటోరియం ఆప్షన్ ఎంచుకోవడం వల్ల 239 ఈఎంఐల బదులు 263 ఈఎంఐలు చెల్లించాల్సి వస్తుంది. మొత్తం వడ్డీ రూ.43,98,351 అవుతుంది. మారటోరియం లేనప్పుడు వడ్డీ రూ.37,70,792 కాగా మారటోరియం ఎంచుకుంటే వడ్డీ రూ.43,98,351. తేడా రూ.6,27,559. అంటే ఆరు నెలల ఈఎంఐ వాయిదా వేయడం వల్ల రూ.6,27,559 నష్టపోతున్నట్టు ఈ ఉదాహరణ చూస్తే అర్థమవుతుంది.కాబట్టి మారటోరియం ఆప్షన్ వల్ల కస్టమర్లకు నష్టం తప్ప ఎలాంటి లాభం లేదు. కానీ ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నవాళ్లు, ఈఎంఐ చెల్లించే పరిస్థితి లేనివారికి మారటోరియం ఆప్షన్ ఎంచుకోకతప్పదు. వారికి తప్ప మిగతావారెవరూ మారటోరియం ఆప్షన్ ఎంచుకున్నా నష్టపోవాల్సిందే.వాల్సిందే.
0 comments:
Post a Comment