రైళ్లకు గ్రీన్ సిగ్నల్.. టికెట్లు బుక్ చేసుకోండి.. డేట్ ప్రకటించిన రైల్వే శాఖ..
ప్రయాణికుల రైళ్లు ప్రారంభమయ్యే తేదీని రైల్వే శాఖ ప్రకటించింది. ఈనెల 12వ తేదీ నుంచి ప్రయాణికుల రైళ్లను నడుపుతున్నట్టు రైల్వే శాఖ స్పష్టం చేసింది. ఈ మేరకు ఓ ప్రకటన జారీ చేసింది. న్యూ ఢిల్లీ నుంచి దేశంలోని 15 గమ్యస్థానాలకు ఈ రైళ్లను (మొత్తం 30 సర్వీసులు) నడపనున్నారు. వీటిని స్పెషల్ ట్రైన్లుగా పిలుస్తారు.
న్యూఢిల్లీ నుంచి సికింద్రాబాద్, దిబ్రూగఢ్, అగర్తలా, హౌరా, పాట్నా, బిలాస్ పూర్, రాంచీ, భువనేశ్వర్, బెంగళూరు, చెన్నై, తిరువనంతపురం, మడ్‌గావ్, ముంబై సెంట్రల్, అహ్మదాబాద్, జమ్మూతావీ రైల్వే స్టేషన్లకు ప్రయాణికుల రైళ్లను నడుపుతున్నట్టు రైల్వే ప్రకటించింది. ఈనెల 11వ తేదీ సాయంత్రం 4 గంటల నుంచి ఐఆర్‌సీటీసీలో టికెట్లను బుక్ చేసుకోవచ్చు.
List of special Trains
List of special Trains
0 comments:
Post a Comment