Monday 11 May 2020

ప్యాసింజర్స్ అలర్ట్ః తెలుగు రాష్ట్రాల్లో నడిచే రైళ్ల వివరాలు..

ప్యాసింజర్స్ అలర్ట్ః తెలుగు రాష్ట్రాల్లో నడిచే రైళ్ల వివరాలు..


కరోనా, లాక్‌డౌన్ కారణంగా గత కొద్ది రోజులుగా ఇండియన్ రైల్వే ప్రయాణికుల రైళ్లు నిలిచిపోయిన సంగతి తెలిసిందే. కాగా, తిరిగి మే 12 నుంచి (రేపటి) భారతీయ రైల్వే ప్రయాణికుల రైళ్లను నడపనుంది. దేశంలోని 15 రాజధాని రూట్లలో .30 సర్వీసుల్ని నడపనుంది రైల్వే. ప్రతీ కోచ్‌లో 72మంది ప్రయాణికులు ప్రయాణించవచ్చు. ఇక ఈ రోజు(మే 11) సాయంత్రం 4 గంటలకు ఐఆర్‌సీటీసీ వెబ్‌సైట్‌లో టికెట్లు బుక్ చేసుకోవచ్చు. అయితే, ఈ రైళ్లలో కొన్ని ట్రైన్స్ తెలుగు రాష్ట్రాల్లోని పలు ప్రాంతాల నుంచి నడుస్తాయి.
తెలుగు రాష్ట్రాల్లో నడిచే రైళ్లు..వివరాలు..



బెంగళూరు- న్యూఢిల్లీః

మే 12 నుంచి బెంగళూరు-న్యూఢిల్లీ రూట్‌లో స్పెషల్ ట్రైన్ నడుస్తుంది.
ఈ రైలు ప్రతీ రోజు అందుబాటులో ఉంటుంది. శ్రీ సత్యసాయి ప్రశాంతి నిలయం, ధర్మవరం జంక్షన్, అనంతపురం, గుంతకల్ జంక్షన్, సికింద్రాబాద్ జంక్షన్, కాజిపేట్ జంక్షన్‌లలో ఈ రైళ్లు ఆగుతాయి.

న్యూఢిల్లీ- చెన్నై సెంట్రల్ః విజయవాడ, వరంగల్‌
మే 13 నుంచి న్యూ ఢిల్లీ-చెన్నై సెంట్రల్‌ రూట్‌లో ప్రతీ బుధవారం, శుక్రవారం ప్రత్యేక రైళ్లు అందుబాటులో ఉంటాయి. ఈ రైళ్లు విజయవాడ, వరంగల్‌లో ఆగుతాయి.

న్యూఢిల్లీ - సికింద్రాబాద్ః కాజీపేట జంక్షన్
న్యూ ఢిల్లీ నుంచి సికింద్రాబాద్, బెంగళూరు, చెన్నై, దిబ్రుగఢ్, అగర్తలా, హౌరా, పాట్నా, బిలాస్‌పూర్, రాంచీ, భువనేశ్వర్, తిరువనంతపురం, మడగావ్, ముంబై సెంట్రల్, అహ్మదాబాద్, జమ్మూతావి రూట్లలో ఈ రైళ్లు నడుస్తాయి. తెలంగాణలోని కాజీపేట్ జంక్షన్‌లో ఈ రైళ్లు ఆగుతాయి.

0 comments:

Post a Comment

Recent Posts