ఇండియన్ ఆర్మీ లెఫ్టెనింట్ .. చైనీస్ మేజర్ పై పంచ్ విసిరాడు. ముక్కుపై కొట్టడంతో రక్తం కారి అక్కడే పడిపోయాడు. ఇన్ఫాంట్రీ యూనిట్ కు చెందిన ఆఫీసర్ ముగుతాంగ్ చైనీస్ కమిసర్ దగ్గర భారత ఆర్మీపై విరుచుకుపడ్డారు. సిక్కిం బోర్డర్లోనే చైనా ఆర్మీ అధికారులు ఇండియన్ ఆర్మీని వెళ్లిపొమ్మంటూ హెచ్చరించడంతో వివాదం మొదలైంది. 'ఇది (సిక్కిం)మీ నేల కాదు. భారత భూభాగానికి సంబంధించినది కాదు వెనక్కి వెళ్లిపోండి' అని చైనా మేజర్ తిట్టాడు.
మిలటరీ కుటుంబానికి చెందిన లెఫ్టినెంట్ అది జీర్ణించుకోలేకపోయాడు. తాత ఇండియన్ ఎయిర్ ఫోర్స్ ఉద్యోగి. తండ్రి ఇండియన్ ఆర్మీలో కల్నల్. చైనా మేజర్ అంటోన్న మాటలకు అంతే ఆవేశంగా బదులిచ్చాడు.
'ఏంటి సిక్కిం మా నేల కాదా.. ఇదేం మాట' అనడంతో పీఎల్ఏ మేజర్ ఒకరు ఇండియన్ సీనియర్ ఆఫీసర్ మీదకు దూసుకొచ్చాడు. అతణ్ని అడ్డుకోవాలని ముందుకెళ్లి ముక్కుపై ఒక్క పంచ్ విసిరాడు.
ఆ దెబ్బకు చైనా మేజర్ కుప్పకూలడంతో అతణ్ని వెనక్కి మోసుకెళ్లారు. కొలీగ్స్ వెనక్కి తీసుకురావడంతో లెఫ్టినెంట్ అక్కడితో ఆపేశాడు. ఆ తర్వాత ఆఫీసర్స్, కోల్‌కతా, సుఖ్నా డివిజనల్ హెడ్ క్వార్టర్స్ నుంచి కంగ్రాట్స్ అందాయి. ఆ లెఫ్టినెంట్ ను గ్రూప్ మొత్తం చాలా మంచి పని చేశాం. చైనా అధికారులు చక్క బుద్ధి చెప్పావంటున్నారు. ఓ సీనియర్ ఆఫీసర్ మాట్లాడుతూ.. 'ఈ లెఫ్టినెంట్ ట్రూప్ మొత్తానికి హీరో అయిపోయాడు' అని అన్నారు.
అన్ని ప్రశంసలు అందినప్పటికీ అతని కాంటాక్ట్ నెంబర్, ఉండే లొకేషన్ ను షేర్ చేసుకోవడానికి ఇష్టపడలేదు. ఇలాంటివి బయటపెడితే చైనీయులు ఫ్రస్టేషన్ కు గురై ఇతర సమస్యలు తీసుకొస్తారని ఓ కల్నల్ సూచించారు. మరో బ్రిగేడియర్ 'చైనీయులకు ఓ అలవాటు ఉంది. టార్గెట్ చేసుకుని దాడి చేస్తారు' అని సూచించి లెఫ్టినెంట్ వివరాలు బయటకు రానివ్వలేదు. రిటైర్డ్ కల్నల్ అయిన అతని తండ్రి తన కొడుకు భవిష్యత్ పాడవుతుందని మీడియా ముందు వివరాలు చెప్పేందుకు ఇష్టపడటం లేదు.
0 comments:
Post a Comment