ఏపీ విద్యుత్ బిల్లుల చెల్లింపుపై ట్రాన్స్‌కో కీలక నిర్ణయం
ప్రస్తుతం కరోనా మహమ్మారి భయం జనాన్ని తీవ్ర స్థాయిలో వెంటాడుతోంది. ఇతరులను ఇళ్ల సమీపంలోకి కూడా రానివ్వడం లేదు. ఈ క్రమంలోనే విద్యుత్ మీటర్ రీడర్లు కూడా గత నెల ఎవ్వరికీ కరెంట్ రీడింగ్స్ తీయలేదు. దీంతో లాక్‌డౌన్, కరోనా ప్రభావం ఏపీలో కరెంట్ బిల్లులపై భారీగానే పడింది. ఈ క్రమంలోనే గత మార్చి బిల్లును ఏప్రిల్‌కు చెల్లిస్తే సరిపోతుందని క్లారిటీ ఇచ్చారు అధికారులు. దీంతో ప్రజలు కూడా అదే ఫాలో అయ్యారు. కానీ, మే నెలలో రీడింగ్స్ తీడంతో ప్రజలకు కరెంట్ షాక్ తగులుతోంది.
మే నెలలో జారీ చేస్తున్న బిల్లులు మామూలుగా వచ్చే వాటి కన్నా చాలా అధికంగా ఉన్నాయని వినియోగదారులు వాపోతున్నారు. పనులులేక ఇల్లు గడవటం కూడా కష్టమైన తరుణంలో ఇంతింత బిల్లులు ఎలా కట్టాలంటూ ఆక్రోశం వ్యక్తం చేస్తున్నారు.
అధికారులు మాత్రం బిల్లులు పెరగలేదనీ, శ్లాబులు మారాయంతేనంటూ చెప్పుకొస్తున్నారు. నెల రోజుల తర్వాత వస్తున్న బిల్లులను చూసి వినియోగదారులు లబోదిబోమంటున్నారు. ఇదిలా ఉంటే.. ఏపీ విద్యుత్ బిల్లుల చెల్లింపుపై ట్రాన్స్‌కో కీలక నిర్ణయం తీసుకుంది.
ఇందులో భాగంగా.. విద్యుత్ బిల్లుల చెల్లింపునకు 45 రోజుల గడువు ఇస్తున్నట్లు ట్రాన్స్‌కో అధికారులు వెల్లడించారు. వాస్తవానికి నిబంధన ప్రకారం బిల్లు జారీ చేసినప్పటి నుంచి 15 రోజుల్లోపు కట్టాలి. కానీ కరోనా నేపథ్యంలో జూన్ 15 వరకు ఎలాంటి జరిమానా లేకుండా చెల్లించే వెసులుబాటు కల్పిస్తున్నట్లు అధికారులు తెలిపారు. ఇక బిల్లులపై ఏవైనా అనుమానాలు ఉంటే 1912 నంబర్ కు ఫోన్ చేయాలన్నారు. మరోవైపు భారీగా మొత్తంలో కరెంట్ బిల్లు రావడంతో వినియోగదారుడి గుండె గుబేల్‌మనిపిస్తోంది.
0 comments:
Post a Comment