ఎస్ఈసీ నిబంధనలు మారుస్తూ ఏపీ ప్రభుత్వం తీసుకొచ్చిన ఆర్డినెన్స్ ను ఏపీ హైకోర్టు శుక్రవారం నాడు కొట్టివేసింది. మాజీ ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ ను వెంటనే విధుల్లోకి తీసుకోవాలని హైకోర్టు ఆదేశించింది.
ఆర్టికల్ 213 ప్రకారం ఆర్డినెన్స్ రాష్ట్ర ఎన్నికల సంఘం కమిషనర్ తొలగింపు విషయమై ఆర్డినెన్స్ తెచ్చే అధికారం రాష్ట్ర ప్రభుత్వానికి లేదని హైకోర్టు అభిప్రాయపడింది.మాజీ ఎస్ఈసీ నిమ్మగడ్డ రమేష్ కుమార్ తొలగిస్తూ రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చిన జీవోలను కూడ హైకోర్టు కొట్టివేసింది.నిమ్మగడ్డ రమేష్ కుమార్ ను తిరిగి విధుల్లోకి తీసుకోవాలని కూడ హైకోర్టు ఇవాళ సంచలన తీర్పును వెల్లడించింది.
నిమ్మగడ్డ రమేష్‌కుమార్ ను ఎన్నికల సంఘం కమిషనర్ గా తొలగించడాన్ని నిరసిస్తూ ఏపీ హైకోర్టులో 13 పిటిషన్లు దాఖలయ్యాయి.ఈ పిటిషన్లపై హైకోర్టు విచారణ జరిపింది.ఇవాళ తుది తీర్పు ఇచ్చింది.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఎన్నికల కమిషనర్ గా నిమ్మగడ్డ రమేష్ కుమార్ ను తొలగిస్తూ రిటైర్డ్ న్యాయమూర్తి వి. కనగరాజ్ ను నియమిస్తూ ఏపీ ప్రభుత్వం ఈ ఏడాది ఏప్రిల్ 11వ తేదీన 619 జీవోను జారీ చేసింది.
నిమ్మగడ్డ రమేష్ కుమార్ ను తొలగించేందుకు వీలుగా రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్ర ఎన్నికల సంఘం నిబంధనల్లో మార్పులు చేర్పులు చేసింది. ఈ మేరకు ఆర్డినెన్స్ ను తెచ్చింది. ఈ ఆర్డినెన్స్ అధారంగా 619 జీవోను జారీ చేసింది. దీంతో నిమ్మగడ్డ రమేష్ కుమార్ స్థానంలో కనగరాజ్ ను నియమించింది.
0 comments:
Post a Comment