Sunday, 31 May 2020

'రిమూవ్ చైనా యాప్స్'అనే ఆప్ సహాయంతో మన మొబైల్ లోని చైనా ఆప్ లను సులభంగా తొలగించవచ్చు

భారత్-చైనా సరిహద్దుల్లో కొన్ని రోజులుగా ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్న సంగతి తెలిసిందే. లఢఖ్, సిక్కిం సరిహద్దుల్లో ఇరు దేశాలు సైన్యాన్ని మోహరించాయి. కరోనా మహమ్మారి కూడా మొదట వుహాన్ నగరంలో పుట్టింది. అలాగే చైనాకు చెందిన టిక్ టాక్ యాప్ మత విద్వేషాలను, జంతు హింసను ప్రోత్సహిస్తుందని ఆరోపణలు వస్తున్నాయి. అలాగే చైనా యాప్స్ స్మార్ట్ ఫోన్ వినియోగదారుల వ్యక్తిగత సమాచారాన్ని దొంగలిస్తున్నాయని తెలుస్తోంది.





ఫేస్‌బుక్ వేదికగా అందమైన అమ్మాయిల ఫోటోలతో యాడ్స్ ఇస్తూ యూజర్లకు వల వేస్తున్నాయి. ఈ విషయాన్ని సాంకేతిక నిపుణులు సైతం పసిగట్టారు.
ఇందుకోసం యాడ్స్ అంటూ ఫేస్‌బుక్‌కు భారీ మొత్తంలో చెల్లింపులు జరుపుతున్నారు. అలా ఫేస్‌బుక్, తదితరాల త్వారా చాటింగ్ యాప్‌లోకి లాగిన్ అవగానే యూజర్ల వ్యక్తిగత సమాచారాన్ని కాజేస్తున్నారు. ఈ కారణాలు అన్ని కలిసి భారతీయులు చైనా యాప్ లపై యుద్ధం ప్రకటిస్తున్నారు. తమ ఫోన్లలో ఉన్న చైనా యాప్ లను డిలీట్ చేస్తున్నారు. ఇందుకోసం 'రిమూవ్ చైనా యాప్స్' అనే యాప్ ను వినియోగిస్తున్నారు.



స్వదేశీ వస్తువులను, స్వదేశీ యాప్స్ ను వినియోగించడం ప్రోత్సహించనే ఉద్దేశ్యంతో జైపూర్ కు చెందిన వన్ టచ్ ఆప్ లాబ్స్ అనే స్టార్టప్ కంపెనీ 'రిమూవ్ చైనా యాప్స్' అనే యాప్ ను రూపొందించింది. ఈ యాప్ ప్రస్తుతం ఎంతో ప్రాచుర్యం పొందుతోంది. యాప్ గూగుల్ ప్లే స్టోర్ లో రేటింగ్ భారీగా పెరిగింది. ప్రస్తుతం 4.8 రేటింగ్ తో దూసుకుపోతుంది. ఇప్పటికే లక్షకుపైగా నెటిజన్లు దీనిని డౌన్ లోడ్ చేసుకున్నారు. ఈ యాప్ ను ఇన్స్టాల్ చేయగానే అది ఫోన్ లో ఉన్న యాప్స్ ను స్కాన్ చేసి ఫోన్లో ఉన్న చైనా యాప్స్ వివరాలను తెలియజేస్తుంది. అప్పుడు స్మార్ట్ ఫోన్ యూజర్ చైనా యాప్స్ ను డిలీట్ చేసుకోవచ్చు.


0 comments:

Post a Comment

Recent Posts