Friday, 29 May 2020

ఏపిలో మరిన్ని సడలింపులు

కరోనా వైరస్ లాక్ డౌన్ 4.0 గడువు రేపటితో ముగుస్తున్న వేళ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తాజాగా లాక్ డౌన్‌కు సంబంధించి రాష్ట్రంలో ప్రజలకు మరికొన్ని మినహాయింపులు ఇచ్చింది. 
ముఖ్యంగా రవాణా రంగానికి ఈ మినహాయింపులను ప్రకటించింది. ఏపీ పరిధిలో ప్రజారవాణా వాహనాలకు ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. ఆటోలు, కార్లు, ఇతర ప్రైవేటు వాహనాలకు లాక్​డౌన్ నుంచి మినహాయింపు ఇచ్చింది. కంటైన్మెంట్ జోన్లు మినహా ఇతర ప్రాంతాల్లో ప్రయాణికులకు అనుమతినిచ్చింది. అయితే కరోనా నిబంధనలు పాటిస్తూ ప్రయాణాలు చేయాలని ఆదేశాలు జారీ చేసింది. ప్రైవేటు వాహనాల్లో 50 శాతం సీట్లలో ప్రయాణానికి పచ్చజెండా ఊపింది.


ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం సమయానికి అనుగుణంగా కొన్ని మినహాయింపులు ఇస్తూ వస్తోంది.

కరోనా కేసులుఎక్కువగా ఉన్న ప్రాంతాల్లోని కంటైన్మెంట్ జోన్లలో మాత్రం కచ్చితంగా నిబంధనలు అమలు చేస్తూ మిగిలిన ప్రాంతాల్లో సడలింపులు ఇస్తోంది. కొన్ని రోజుల క్రితం ఏపీ పరిధిలో ఆర్టీసీ బస్సులకు అనుమతులు ఇచ్చింది. తాజాగా, ప్రైవేట్ వాహనాలకు కూడా షరతులతో పర్మిషన్ ఇచ్చింది.

0 comments:

Post a Comment

Recent Posts