Monday, 18 May 2020

CBSE 12th Class Examination Schedule

CBSE 12th Class Examination Schedule Released.  The 12th class exams will be held from July 1 to 15.  Every student is required to wear a mask for exams.  CBSE said it would also come with sanitizers.  A statement released today said that students who are ill will not be allowed for exams.  Union minister Ramesh Pokhriyal disclosed this on Twitter.  Ramesh Pokhriyal has announced that 3000 CBSE schools in the country have been selected as evaluation centers.
 Teachers will evaluate more than 1.5 crore answer sheets, he said.  Due to the lockdown, the scheduled tests were initially postponed.



సీబీఎస్ఈ 12వ తరగతి పరీక్షల షెడ్యూల్ విడుదలైంది. జూలై 1 నుంచి 15 వరకు 12వ తరగతి పరీక్షలు జరుగనున్నాయి. పరీక్షలకు ప్రతి ఒక్క విద్యార్థి మాస్క్‌ తప్పనిసరిగా ధరించాలని నిబంధన విధించారు. అలాగే సానిటైజర్స్‌తో రావాలని సీబీఎస్‌ఈ తెలిపింది. అనారోగ్యంగా ఉన్న విద్యార్థులను పరీక్షలకు అనుమతించరని ఓ ప్రకటన విడుదల చేసింది. ఈ మేరకు కేంద్ర మంత్రి రమేష్ పోఖ్రియాల్ ట్విట్టర్ ద్వారా వెల్లడించారు. దేశంలోని 3 వేల సీబీఎస్ఈ పాఠశాలలను మూల్యాంకన కేంద్రాలుగా ఎంపిక చేసినట్లు రమేష్ పోఖ్రియాల్ ప్రకటించారు.
దాదాపు 1.5 కోట్లకు పైగా జవాబు పత్రాలను ఉపాధ్యాయులు మూల్యాంకనం చేయనున్నట్లు ఆయన తెలిపారు. కాగా లాక్‌డౌన్‌ కారణంగా షెడ్యూల్‌ ప్రకారం జరగాల్సిన పరీక్షలు తొలుత వాయిదా పడ్డ విషయం తెలిసిందే.

0 comments:

Post a Comment

Recent Posts