Thursday 14 May 2020

Important Events of May 15

🌎 *చరిత్రలో ఈ రోజు*
Important Events of May 15

🔴 *ప్రత్యేక  దినాలు*


🚩 *అంతర్జాతీయ కుటుంబ దినోత్సవం (15 మే)*

[కష్టం-సుఖం,   బాధ-ఆనందం,   ఆత్మీయత-అనురాగంఅన్నీ కలగలిసిన అద్భుత ప్రపంచం.. కుటుంబంఅరుగులపై అందరూ కలిసి కథల్ని, కలల్ని, మాటల్ని, రంగుల్ని, రంగవల్లుల్ని, అన్ని వివరాలు చెప్పేదే కుటుంబం. మన సాంప్రదాయ భారతీయ సమాజానికి పటిష్టతనూ దృఢత్వాన్నీ అందిస్తున్న శక్తి.. శతాబ్దాలుగా మనందర్నీ కలిసికట్టుగా ఉంచిన ఒక శక్తివంతమైన బంధం.. మన సుసంపన్నమైన సామాజిక యవనికను వైవిధ్యంగా మార్చి ఒక సమగ్ర రూపంగా మార్చేదే కుటుంబ వ్యవస్థ. అలాంటి కుటంబ వ్యవస్థ ప్రాముఖ్యతపై అవగాహన కల్పించడమే అంతర్జాతీయ కుటుంబ దినోత్సవ ముఖ్య ఉద్దేశ్యం.
నేటికాలంలో సమాజంలో కుటుంబ వ్యవస్థ బలహీనపడుతున్న ఈ నేపథ్యంలో కుటుంబాల విలువలను తెలియజేయడంకోసం ఈ కుటుంబ దినోత్సవం నిర్వహించబడుతుంది.]
〰〰〰〰〰〰〰〰

🏀 *సంఘటనలు*


✴1928: మిక్కీ మౌస్ ప్లేన్ క్రేజీ అనే కార్టూన్ ద్వారా అరంగేట్రం చేసింది.
✴1952: భారత లోక్‌సభ స్పీకర్‌గా గణేష్ వాసుదేవ్ మావ్లాంకర్ పదవిని స్వీకరించాడు.
✴1989: గ్రామ పంచాయతీలకు రాజ్యాంగంలో హోదాను కల్పిస్తూ రాజ్యాంగానికి 64వ సవరణ జరిగింది.
✴2012: టెలికాం మంత్రి ఎ. రాజాకు 2012 మే 15 నాడు 2జి ట్రయల్ కోర్టు బెయిలు మంజూరు చేసింది. టెలికాం మంత్రి ఎ. రాజాను 2011 ఫిబ్రవరి 2 నాడు, 2జి స్పెక్త్రుం కేసులో అరెస్టు చేసి తీహారు జైలులో ఉంచారు.
〰〰〰〰〰〰〰〰

🌐 *జననాలు*

❇1803: సర్ ఆర్థర్ కాటన్, బ్రిటిషు సైనికాధికారి, నీటిపారుదల ఇంజనీరు. (మ.1899)
❇1817 : భారత మత సంస్కర్త, దేవేంద్రనాథ్ ఠాగూర్ జననం.(మ.1905)
❇1859 : ప్రముఖ ఫ్రెంచి శాస్త్రవేత్త పియరీ క్యూరీ జననం.(మ. 1906)
❇1907: సుఖ్ దేవ్, భారత జాతీయోద్యమ నాయకుడు (మ,1931).
❇1908: వింజమూరి శివరామారావు, ఆకాశవాణికి ఎన్నో లలిత గీతాలను, రూపకాలను వ్రాసి ప్రసారం చేశారు. 600 రేడియో నాటికలు వ్రాశారు. (మ.1982).
❇1915: పాల్ సామ్యూల్‌సన్, ప్రముఖ ఆర్థికవేత్త (మ.2009).
❇1923 : భారత సినిమా నటుడు జానీవాకర్ జననం. (మ.2003)
❇1926: నూతి విశ్వామిత్ర, ఆర్యసమాజ్ నాయకుడు, నిరంకుశ నిజాం పాలన వ్యతిరేకోద్యమ నాయకుడు
❇1938: కె.జమునారాణి,పదమూడేళ్ల వయసు నుండే కథానాయకిలకు పాడటం ప్రారంభించింది
❇1964: జి.కిషన్ రెడ్డి, భారతీయ జనతా పార్టీ నేత, కేంద్ర హోంశాఖ సహాయమంత్రి.
❇1967: మాధురీ దీక్షిత్, హిందీ సినీనటి .
❇1968: స్రవంతి ఐతరాజు, కవి, తిరుపతిలో హాస్టల్ సంక్షేమ అధికారి, మనస్తత్వవేత్త
❇1987: రామ్ (నటుడు), తెలుగు, తమిళ భాషల చిత్రసీమకు సంబంధించిన నటుడు.
〰〰〰〰〰〰〰〰

⚫ *మరణాలు*


◾1994: ఓం అగర్వాల్, భారత స్నూకర్ క్రీడాకారుడు.
◾2010: భైరాన్ సింగ్ షెకావత్, భారత మాజీ ఉప రాష్ట్రపతి. (జ.1923)
◾2014: మల్లాది సుబ్బమ్మ, స్త్రీవాద రచయిత్రి, హేతువాది, స్త్రీ స్వేచ్ఛ పత్రిక సంపాదకురాలు. (జ.1924) 

0 comments:

Post a Comment

Recent Posts