Important Events of May 22
🌎 *చరిత్రలో ఈ రోజు*
🔴 *ప్రత్యేక దినాలు*
🚩 *అంతర్జాతీయ జీవవైవిధ్య దినోత్సవం*
సృష్టి లోని ప్రతీ జీవరాశిని బతకనిద్దాం, వాటిని కాపాడుకుందాం.
*మే 22* తేదీని *అంతర్జాతీయ జీవవైవిధ్య దినోత్సవం* గా, 2010ని అంతర్జాతీయ జీవవైవిధ్య సంవత్సరంగా ఐక్యరాజ్యసమితి ప్రకటించింది.
భూమిపై జీవాల మధ్య భేదాన్నే 'జీవవైవిధ్యం' అంటాం. నేడు మన భూమిపై ఉన్న అనేక మిలియన్ల వివిధ జాతుల జీవవైవిధ్యం సుమారు 3.5 బిలియన్ సంవత్సరాల పరిణామం. మన జీవనశైలితో పర్యావరణం కాలుష్యం చెందడంతో భూగోళం వేడెక్కిపోతుంది. దీంతో జీవవైవిధ్యం దెబ్బతింటోంది. ఎన్నో జీవజాతులు అంతరించిపోతున్నాయి. అంతెందుకు మీలో ఎంతమంది 'పిచ్చుక'ను చూశారు? చాలామంది చూడలేదనే చెపుతారు కదూ! ఇదివరకూ ప్రతి ఇంటిలో పిచ్చుకలు ఉండేవి. రాను రానూ అవి కనుమరుగైపోతున్నాయి.
ప్రపంచంలోని 12 మహా జీవవైవిధ్య ప్రాంతాలలో మనదేశం ఒకటి. సుమారు 45 వేల వృక్ష జాతులు, దాదాపు 77 వేల జంతు జాతులు మనదేశంలో ఉన్నాయి. కానీ ఇదంతా గతం. నేడు ఆ విస్తారమైన జీవ సంపదలో 10 శాతానికిపైగా ప్రమాదంలో ఉంది. వాటిలో చాలా జాతులు అంతరించిపోయే దశలో ఉన్నాయి. గత కొన్ని దశాబ్దాలలో 50 శాతానికిపైగా అరణ్యాలు, 70 శాతానికి పైగా నీటి వనరులు లుప్తమైపోయాయి. విస్తారంగా ఉన్న పచ్చిక బయళ్ళను మన జీవనశైలితో రూపుమాపేశాము. సముద్రతీరాలను అతలాకుతలం చేసేశాము. ఇవన్నీ చాలవన్నట్టు అరణ్యాలలోని వన్యప్రాణుల్ని వేటాడి కొందరు అంతమొందిస్తున్నారు.
వ్యవసాయంలో రసాయనిక ఎరువులకు, కీటక నాశనులకు ప్రాధాన్యత పెరిగింది. మందుల కంపెనీల లాభాపేక్ష వాటిని అధికంగా, విచక్షణారహితంగా వాడేలా చేసింది. దీంతో మన నేలను, దానిపై నివసించే విలువైన జీవసంపదను కోల్పోవాల్సి వచ్చింది. అంతేకాదు మనదేశంలో అత్యధిక కీటక నాశనులను ఉత్పత్తి చేసే దేశంగా విరాజిల్లుతోంది. ఇటువంటి అవాంఛనీయ చర్యల వల్ల దారుణంగా నష్టపోయాం. అంతేకాదు అపార జీవజాతులు అంతరించిపోయాయి.
*ఎలా కాపాడుకొందాం..*
మన జీవనశైలిని మార్చుకోవాలి. రసాయన కాలుష్యాన్ని అరికట్టి భూతాపాన్ని తగ్గించాలి. జంతువుల్ని, మొక్కల్ని పరిరక్షించుకోవాలి. చాలా మంది జంతువుల చర్మాలతో చేసే వస్తువుల్ని వాడుతుంటారు. దీన్ని మానుకోవాలి. మొక్కలు నాటి పర్యావరణాన్ని పరిరక్షించుకుందాం.
🚩 *యెమన్ జాతీయదినోత్సవం*
〰〰〰〰〰〰〰〰
🏀 *సంఘటనలు*
✴ *1455*: 30 సంవత్సరాల *వార్స్ ఆఫ్ రోజెస్* యుద్ధం మొదలైన రోజు.
✴ *1841*: ఫిలడెల్ఫియా ( పెన్సిల్వేనియా రాష్ట్రం) కి చెందిన *హెన్రీ కెన్నెడీ*, మొట్ట మొదటి *ఆధునిక కుర్చీ* ( వంగిన భాగాలతో తయారు చేసింది. *పడక కుర్చీ*, (రిక్లైనింగ్ చైర్ ) కోసం ఒక పేటెంట్ పొందాడు.
✴ *1849*: *అబ్రహం లింకన్*, తేలియాడే (మునగని) డ్రై డాక్ (ఫ్లోటింగ్ డ్రైడాక్ ) కోసం పేటెంట్ నంబర్ 6469 అందుకున్నాడు.
✴ *1942* : *రిపబ్లిక్ ఆఫ్ శ్రీలంక* అవతరించింది.
✴ *1972*: *సిలోన్* ద్వీపం కొత్త రాజ్యాంగం అమలు చేయటంతో, పేరు మార్చుకుని, *రిపబ్లిక్ ఆఫ్ శ్రీలంక* గా మారింది
✴ *2004*: భారత 13వ ప్రధానమంత్రిగా *మన్మోహన్ సింగ్* నియమితుడైనాడు. (14వ లోక్ సభ)
✴ *2008*: నెల్లూరు జిల్లాను *పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా* గా మార్చుటకు ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వు జారీచేసింది
✴ *2009*: భారత 13వ ప్రధానమంత్రిగా *మన్మోహన్ సింగ్* నియమితుడైనాడు. (15వ లోక్ సభ). ఎక్కువకాలం, ప్రధాని పదవిలో ఉన్న మూడవ ప్రధాని 2639 రోజులు). (మొదటి ప్రధాని 6130 రోజులు. రెండవ ప్రధాని 5829 రోజులు).
〰〰〰〰〰〰〰〰
🌐 *జననాలు*
❇ *1772* : సంఘ సంస్కర్త *రాజా రామ్మోహన్ రాయ్* జననం. (మ. 1833).
[ సామాజిక మత సంస్కరణ ఉద్యమాలకు ఆద్యుడు. స్త్రీ స్వాతంత్ర్యానికి సాధికారతకు బాటలు వేసిన మహనీయుడు. బ్రహ్మ సమాజ్, భారతదేశములో మొదటి సామాజిక-మత సంస్కరణ ఉద్యమాలను ప్రారంభించాడు. అతని విశేషమైన ప్రభావము రాజకీయ, ప్రభుత్వ నిర్వహణ, విద్యా రంగముల లోనే కాకుండా హిందూ మతము పైన కూడా కనపడుతున్నది. ఇతడు గొప్ప సంఘసంస్కర్త. బ్రిటిష్ ఇండియా కాలంలో అప్పటి ప్రముఖ సాంఘిక దురాచారమైన సతీసహగమనాన్ని రూపుమాపడానికి చాలా కృషిచేశాడు. వితంతు పునర్వివాహానికి కూడా మద్దతు పలికినాడు. స్త్రీవిద్యకై పాటుపడ్డాడు. బ్రహ్మసమాజాన్ని స్థాపించాడు. ఆంగ్ల విద్యకు అనుకూలంగా ఉండి, దేశంలో ఆంగ్ల విద్యావిధానానికి కృషిచేశాడు.]
❇ *1783*: *విలియం స్టర్జియన్*, మొదటి ఆచరణాత్మకమైన, విద్యుదయస్కాంతం నిర్మాత, ఆంగ్ల శాస్త్రవేత్త.
❇ *1822*: *పరవస్తు వెంకట రంగాచార్యులు*, సంస్కృతాంధ్ర పండితుడు. (మ.1900)
❇ *1828*: *ఆల్ బ్రెచ్ట్ గ్రాఫె*, ఆధునిక నేత్ర వైద్యమును అభివృద్ధి చేసిన మొదటి నేత్ర వైద్యుడు.
❇ *1859*: *సర్ ఆర్థర్ కానన్ డోయల్*, షెర్లాక్ హోమ్స్ అనే అపరాధ పరిశోధకుని సృష్టికర్త.
❇ *1888* : సంఘ సంస్కర్త, ఆది ఆంధ్ర సభ స్థాపకుడు *భాగ్యరెడ్డివర్మ* జననం (మ.1939).
❇ *1944*: *రాంరెడ్డి వెంకటరెడ్డి*, ఖమ్మం జిల్లా పాలేరు కాంగ్రెస్ ఎమ్మెల్యే. (మ.2016)
❇ *1948* : పాలమూరు జిల్లాకు చెందిన ప్రముఖ రాజకీయ నాయకుడు *నాగం జనార్ధన్ రెడ్డి* జననం.
❇ *1952* : ప్రముఖ హేతువాది *గుమ్మా వీరన్న* జననం.
〰〰〰〰〰〰〰〰
⚫ *మరణాలు*
◾ *1885*: *విక్టర్ హ్యూగో*, ఫ్రెంచ్ రచయిత. (జ.1802)
◾ *1960*: *మేడవరము సుబ్రహ్మణ్యశాస్త్రి*, సంస్కృతాంధ్రాలలో గొప్ప పండితుడిగా పేరుగాంచిన వ్యక్తి. (జ.1885)
◾ *2002*: *మందులు.కె* రంగస్థల నటుడు, దర్శకుడు. (జ.1944)
◾ *2010*: *వేటూరి సుందరరామ్మూర్తి*, సుప్రసిద్ధ తెలుగు సిసిమా పాటల రచయిత. (జ.1936)
◾ *2015*: *పర్సా సత్యనారాయణ*, కార్మిక నేత, మార్క్సిస్టు యోధుడు. (జ.1924)
◾ *2019*: *చెరుకుమల్లి సూర్యప్రకాశ్* అంతర్జాతీయ స్థాయి ఆయిల్, అక్రిలిక్, అబ్‌స్ట్రాక్ట్ చిత్రకారుడు. (జ.1940)

0 comments:
Post a Comment