Saturday, 23 May 2020

Important Events of May 24

Important Events of May 24
🌎 *చరిత్రలో ఈ రోజు*



🔴 *ప్రత్యేక  దినాలు*

🚩 *కామన్వెల్త్ దినోత్సవం.*
🎡 *International Commonwealth Day was celebrated on May 24, 2020*

🎡 *Established in 1949*

❄ *THEME 2020- Delivering a Common Future Connecting Innovating Transforming*

🎡 *COMMONWEALTH GAMES VENUES* :-

🏇 *2010*- *New Delhi*

🏇 *2022*- *Birmingham England*

💠  *Commonwealth of Nations*

🔶 *Founded* : 1949
🔶 *Head Quarter* : London
🔶 *Secretary General* : Patricia Scotland
🔶 *Member Countries* : 54

🔶 *54th member country*:  Maldives
[ప్రతి ఏడాది మే 24న కామన్వెల్త్ దినోత్సవాన్ని ఘనంగా జరుపుకుంటారు. ఈ కామన్వెల్త్ దినోత్సవాన్ని ఇంతకు ముందు ‘ఎంపైర్ డే’ అని పిలిచేవారు.
ఇరవయ్యో శతాబ్దం ఆరంభంలో బ్రిటిష్ వలస పాలనలోని పలు దేశాలు స్వాతంత్య్రం పొందటం ప్రారంభమైంది. ఈ క్రమంలో ఆయా దేశాలకు బ్రిట‌న్‌కు మధ్య.. ఆయా దేశాల మధ్య సంబంధాలు ఎలా ఉండాలనేందుకు ఒక రాజ్యాంగ బద్ధమైన నిర్వచనం అవసరమైంది. అలా 1931లో ’బ్రిటిష్ కామన్వెల్త్ ఆఫ్ నేషన్స్’ ఏర్పడింది. 1949లో ఈ పేరు నుంచి ‘బ్రిటిష్’ పదాన్ని తొలగించారు. బ్రిటిష్ వలస పాలన నుంచి విముక్తి అయిన‌ దేశాల కూటమిగా అది మారింది. అయితే.. బ్రిటన్ రాచరిక కుటుంబం ఈ కామన్వెల్త్ అధినేతగా కొనసాగుతోంది.ఈ కూటమిలో చేరటమనేది ఆయా దేశాల ఇష్టాయిష్టాల మేరకే జరుగుతుంది. ఇప్పటివరకూ 53 దేశాలు ఇందులో సభ్యులుగా చేరాయి. చివరిగా చేరిన మొజాంబిక్, రువాండాలకు బ్రిటిష్ వలస రాజ్యంతో ఎలాంటి సంబంధం లేదు.
1949 లో ఆధునిక కామన్వెల్త్ ఆవిర్భవించాక ఆస్ట్రేలియా, బ్రిటన్ , సిలోన్ , భారత్ , న్యూజిలాండ్ , పాకిస్తాన్ , దక్షిణాఫ్రికా , కెనడా దేశాధిపతులు లండన్ లో సమావేశమై ఎంపైర్ డే గురించి చర్చించారు . ఫలితంగా అప్పటిదాకా కొనసాగిన ఎంపైర్ డే 1958 నుండి బ్రిటిష్ కామన్వెల్త్ డే గా మారినది . తరువాత 1966 లో కామన్వెల్త్ డే గా రూపాంతరం చెందినది . పాత పోకడలు , చరిత్రతో నిమిత్తము లేకుండా సరికొత్త కామన్వెల్త్ డే నిర్వహించాలని నిర్ణయించారు . ప్రస్తుతము కామన్వెల్త్ దేశాలన్నింటిలొనూ విభిన్న మార్గాలలో కామన్వెల్త్ డే ను నిర్వహిస్తున్నారు .]


〰〰〰〰〰〰〰〰

🏀 *సంఘటనలు*

✴ *1844*: మొట్టమొదటి టెలిగ్రాఫు సందేశాన్ని శామ్యూల్ మోర్స్ అను శాస్త్రవేత్త వాషింగ్టన్ డీ.సీ. నుండి బాల్టిమోర్ కు ప్రసారము చేశాడు.
✴ *1862*: లండన్ లోని థేమ్స్ నది మీద 'వెస్ట్ మినిస్టర్ బ్రిడ్జ్'ని ప్రారంభించారు.
✴ *1875*: సర్ సయ్యద్ అహ్మద్ ఖాన్, మహమ్మద్ ఆంగ్లో ఓరియంటల్ స్కూల్ ను స్థాపించాడు. ఇదే 1920లో అలీఘర్ ముస్లిం యూనివర్శిటీగా అవతరించింది.
✴ *1899*: మొట్టమొదటి 'ఆటో రిపేర్ షాపు' బోస్టన్లో మొదలుపెట్టారు.
✴ *1902*: బ్రిటన్లో మొట్టమొదటి సారిగా 'ఎంపైర్ డే' జరుపుకున్నారు.1959లో 'ఎంపైర్ డే' పేరు 'కామన్ వెల్త్ డే' గా మార్చారు.
✴ *1915*: థామస్ ఆల్వా ఎడిసన్ టెలిఫోన్ సంభాషణలను రికార్డ్ చేయడానికి 'టెలిస్క్రైబ్' ని కనుగొన్నాడు.
✴ *1930*: బ్రాడ్‌మాన్ 290 నిమిషాలలో, 29 ఫోర్స్ (నాలుగులు) లలో 252 పరుగులు సాధించాడు (ఆస్ట్రేలియా వెర్సస్ 'సర్రీ' )
✴ *1931*: మొట్టమొదటి 'శీతలీకరణ రైలు' ప్రవేశ పెట్టారు (బాల్టిమోర్, ఓహియో రైలు మార్గంలో)
✴ *1954*: భూమి నుంచి 241 కి.మీ (150 మైళ్ళ) పైకి రాకెట్ మొట్ట మొదటిసారిగా వెళ్ళింది (ఎగిరింది). (న్యూమెక్సికో లోని 'వైట్‌సాండ్స్'. ఇది ఎడారి ప్రాంతం).
✴ *1959*: ఇంగ్లాండ్లో 'ఎంపైర్ డే' పేరు 'కామన్ వెల్త్ డే' గా మార్చారు. 1902లో 'ఎంపైర్ డే' ని మొదటిసారిగా జరుపుకున్నారు.
✴ *1975*: రష్యాకు చెందిన 'సోయుజ్ 18బి' ఇద్దరు రోదసీయాత్రికులను 'సాల్యూట్ 4' 'స్ఫేస్ స్టేషను (రోదసీ కేంద్రం) కి తీసుకువెళ్ళింది.
✴ *1988*: నిమిషానికి 586 మాటలు మాట్లాడి, *జాన్ మస్చిట్ట*' రికార్డు స్థాపించాడు.
✴ *1993*: మైక్రోసాఫ్ట్ 'విండోస్ ఎన్.టి' (Windows NT) విడుదల చేసింది.
✴ *2001*: *షెర్పా తెంబా* (టెంబా) త్సెరి, అతి చిన్న వయస్సు (15వ ఏట) లో, ఎవరెస్ట్ పర్వతాన్ని ఎక్కాడు.
〰〰〰〰〰〰〰〰

🌐 *జననాలు*

❇ *0015*: *జూలియస్ సీజర్*, జెర్మానికస్, రోమ్ దేశపు సైన్యాధిపతి (మ.0019).
❇ *1686*: *డేనియల్ గాబ్రియల్ ఫారెన్‌హీట్* అతి కచ్చితంగా వేడిని కొలిచే 'థర్మామీటర్' (1714లో మెర్క్యురీ (పాదరసం) థర్మామీటర్) ని కనుగొన్నాడు. 1709 లో ఆల్కహాల్ థర్మామీటర్ ని కనుగొన్నాడు. (మ.1736).
❇ *1819*: *బ్రిటన్ రాణి* విక్టోరియా, బ్రిటీషు మహారాణి. (మ.1901).
❇ *1911*: *ఎస్.వి.ఎల్.నరసింహారావు*, న్యాయవాది, స్వాతంత్ర్య సమరయోధుడు. (మ.2006)
❇ *1933*: *పి.జె.శర్మ*, డబ్బింగ్ కళాకారుడు, తెలుగు రంగస్థల, సినిమా నటుడు. (మ.2014)
〰〰〰〰〰〰〰〰

⚫ *మరణాలు*



◾ *1543*: *నికొలస్ కోపర్నికస్*, ఖగోళ పరిశోధకుడు, పోలాండ్లో మరణించాడు.
◾ *1997*: *నల్లమల గిరిప్రసాద్*, కమ్యూనిస్టు నేత. (జ.1931)
◾ *2013*: *రాయసం వేంకట త్రిపురాంతకేశ్వర రావు*, రచయిత, సాహితీ వేత్త. (జ.1928) 

0 comments:

Post a Comment

Recent Posts