Sir Ronald Ross Jayanti
13 మే, మలేరియా పారసైట్ జీవితచక్రానికి చెందిన పరిశోధకుడు సర్ రోనాల్డ్ రాస్ జయంతి (1857)ఇతనికి మలేరియా పారసైట్ జీవితచక్రానికి చెందిన పరిశోధనకు గాను 1902లో వైద్యశాస్త్రంలో
నోబెల్ బహుమతి ప్రదానం చేయబడింది.
1897 లో ఒక దోమ యొక్క జీర్ణశయాంతర ప్రేగులలో మలేరియా పరాన్నజీవిని ఆయన కనుగొన్నప్పుడు మలేరియా దోమల ద్వారా వ్యాపిస్తుందని ఋజువు చేసింది. ఈ వ్యాధిని ఎదుర్కునే పద్ధతికి పునాది వేసింది.
అతను బహుముఖ ప్రజ్ఞాశాలి. అతను అనేక కవితలు రాసాడు, అనేక నవలలను ప్రచురించాడు. అతను పాటలను స్వరకల్పన చేసాడు. అతను కళాభిలాషి, గణిత శాస్త్రవేత్త కూడా. రొనాల్డ్ రాస్ భారత దేశంలో ఉత్తరాఖండ్ రాష్ట్రంలోని అల్మోరాలో జన్మించాడు. అతని తండ్రి కాంప్‌బెల్ క్లాయె గ్రాంట్ రాస్
బ్రిటిష్ ఇండియన్ ఆర్మీలో జనరల్ గా పనిచేసేవాడు. ఎనిమిదేళ్ల వయసులో ఐల్ ఆఫ్ వైట్‌లో తన అత్త, మామలతో కలిసి జీవించడానికి ఇంగ్లాండ్‌కు పంపించారు. రాస్ విధ్యాభ్యాసం అంతా లండన్ లోనే సాగింది.
రాస్ వైద్యశాస్త్రాన్ని లండన్ లోని సెయింట్ బార్తొలోమ్ హాస్పిటల్ లో 1875 - 1880 మధ్య పూర్తిచేశాడు. 1879 లో, అతను "రాయల్ కాలేజ్ ఆఫ్ సర్జన్స్ ఆఫ్ ఇంగ్లాండ్" పరీక్షలలో ఉత్తీర్ణుడయ్యాడు.
అతను 1881 లో రెండవ ప్రయత్నంలో అర్హత సాధించి ఆర్మీ మెడికల్ స్కూల్లో నాలుగు నెలల శిక్షణ తరువాత, 1881 లో ఇండియన్ మెడికల్ సర్వీసులో ప్రవేశించాడు.
1881 నుండి 1894 వరకు అతను మద్రాస్, బర్మా, బలూచిస్తాన్, అండమాన్ దీవులు, బెంగళూరు, సికింద్రాబాద్‌లలో వివిధ పదవులలో నియమించబడ్డారు. 1883 లో, అతన్ని బెంగళూరులో యాక్టింగ్ గారిసన్ సర్జన్‌గా నియమించారు. ఈ సమయంలో దోమల నీటి సౌలభ్యత తగ్గించడం ద్వారా వాటిని నియంత్రించే అవకాశాన్ని గమనించాడు. అతను సర్ పాట్రిక్ మాన్సన్ గారి సుచనలమేరకు మలేరియా పరిశోధనలో వాస్తవ సమస్యలను గమనించాడు.
భారతీయ వైద్య సేవలో 25 సంవత్సరాలు పనిచేశాడు. తన సేవలోనే అతను సంచలనాత్మక వైద్య ఆవిష్కరణ చేశాడు. భారతదేశంలో తన ఉద్యోగానికి రాజీనామా చేసిన తరువాత, అతను లివర్పూల్ స్కూల్ ఆఫ్ ట్రాపికల్ మెడిసిన్ అధ్యాపకులలో ఒకనిగా చేరాడు. 10 సంవత్సరాల పాటు ఇనిస్టిట్యూట్ ట్రాపికల్ మెడిసిన్ ప్రొఫెసర్ , చైర్మన్ గా కొనసాగాడు.
1926 లో అతను రాస్ ఇనిస్టిట్యూట్, హాస్పిటల్ ఫర్ ట్రాపికల్ డిసీజెస్ లకు డైరెక్టర్-ఇన్-చీఫ్ అయ్యాడు.
అతను చనిపోయే వరకు అక్కడే ఉన్నాడు. అతను హైదరాబాదు
నగరంలో తన పరిశోధన జరిపాడు. ప్రస్తుతం "మినిస్టర్స్ రోడ్"గా పిలిచే రహదారిని 2000 సంవత్సరం వరకు "సర్ రోనాల్డ్ రాస్ రోడ్" అనేవారు.
భారతదేశంలో, రాస్ మలేరియాపై చేసిన కృషి ఫలితాన్ని ఎంతో గౌరవంగా జ్ఞాపకం చేసుకుంటారు. మలేరియా ప్రతి సంవత్సరం వేలాది మంది ప్రాణాలను బలిగొన్న ఘోరమైన అంటువ్యాధి.
అనేక భారతీయ పట్టణాలు, నగరాల్లో అతని పేరు మీద రోడ్లు ఉన్నాయి. కలకత్తాలో ప్రెసిడెన్సీ జనరల్ హాస్పిటల్‌ను, కిడర్‌పూర్ రోడ్‌తో కలిపే రహదారికి అతని పేరు సర్ రోనాల్డ్ రాస్ సరాని అని పేరు మార్చారు. ఇంతకు ముందు ఈ రహదారిని హాస్పిటల్ రోడ్ అని పిలిచేవారు.
అతని జ్ఞాపకార్థం, హైదరాబాద్ లోని ప్రాంతీయ అంటు వ్యాధి ఆసుపత్రికి సర్ రోనాల్డ్ రాస్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ట్రాపికల్ అండ్ కమ్యూనికేషన్ డిసీజెస్ అని పేరు పెట్టారు.
బేగంపేట విమానాశ్రయానికి సమీపంలో సికింద్రాబాద్‌లో ఉన్న మలేరియా పరాన్నజీవిని అతను కనుగొన్న భవనాన్ని ఒక వారసత్వ ప్రదేశంగా ప్రకటించారు.ఆ భవనానికి వెళ్లే రహదారికి సర్ రోనాల్డ్ రాస్ రోడ్ అని పేరుపెట్టారు.
లూధియానాలో, క్రిస్టియన్ మెడికల్ కాలేజ్ తన హాస్టల్‌కు "రాస్ హాస్టల్" అని పేరు పెట్టింది. యువ వైద్యులు తమను తాము "రోసియన్లు" అని పిలుస్తారు.
రోనాల్డ్ రాస్ జ్ఞాపకార్థం భారత తపాలాశాఖ 1997లో పోస్టల్ స్టాంపు విడుదల చేసింది
యునైటెడ్ కింగ్‌డం లోని సర్రే విశ్వవిద్యాలయం తన మనోర్ పార్క్ నివాసాలలో అతని పేరును రహదారికి నామకరనం చేసింది.
వింబుల్డన్ కామన్ సమీపంలోని రోనాల్డ్ రాస్ ప్రైమరీ స్కూల్ అతని పేరు మీద ఉంది. పాఠశాల చిహ్నంలోని నాలుగో భాగంలో ఒక దోమను కలిగి ఉంటుంది.
హైదరాబాదులోని ఉస్మానియా విశ్వవిద్యాలయంలో రోనాల్డ్ రాస్ జ్ఞాపకార్థం సర్ రోనాల్డ్ రాస్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ పారాసిటాలజీ స్థాపించబడింది.
2010 లో లివర్‌పూల్ విశ్వవిద్యాలయం తన గౌరవార్థం తన కొత్త బయోలాజికల్ సైన్స్ భవనానికి "ది రోనాల్డ్ రాస్ బిల్డింగ్" అని పేరు పెట్టింది. అతని మనవడు డేవిడ్ రాస్ దీనిని ప్రారంభించాడు.
1932 సెప్టెంబరు 16 న తన 75 వ ఏట లండన్, (యు.కె )లో ఆయన మరణించాడు.
0 comments:
Post a Comment