Tuesday, 12 May 2020

Important Events on May 12

*🔥మే 12న అంత‌ర్జాతీయ న‌ర్సుల దినోత్స‌వం🔥*


*🏵️ప్ర‌తి ఏడాది మే 12న అంత‌ర్జాతీయ న‌ర్సుల దినోత్స‌వం జ‌రుపుకుంటారు. ఫ్లోరెన్స్ నైటింగేల్ జ‌యంతి రోజున ఆమె గౌర‌వార్థం అంత‌ర్జాతీయ న‌ర్సుల దినోత్స‌వం జ‌రుపుకుంటున్నారు.*

*🖊️ఆమె ఆంగ్ల సామాజిక సంస్క‌ర్త, గ‌ణాంక‌వేత్త మాత్ర‌మే కాదు ఆధునిక న‌ర్సింగ్ వృత్తికి భాష్యం చెప్పిన మ‌హోన్న‌త వ్య‌క్తి నైటింగేల్‌.*


*🌎క్రిమియ‌న్ యుద్ధంలో ఆమె శిక్ష‌ణ పొందిన న‌ర్సుల మేనేజ‌ర్ గా ప‌నిచేస్తున్నప్పుడు గాయ‌ప‌డిన సైనిక‌ల‌కు చేసిన విశిష్ట‌మైన సేవ‌లే ఆమెకు అత్యంత ఖ్యాతిని తెచ్చిపెట్టాయి. విక్టోరియ‌న్ సంస్కృతికి చిహ్నంగా మారింది. గాయ‌ప‌డిన సైనిక‌ల‌కు ఆమె రాత్రి పూట సైతం నిర్వ‌రామంగా సేవ‌లు అందించి “ది లేడి విత్ ది లాంప్” అనే జాతీయానికి కొత్త అర్థాన్నిచ్చింది. 1860లో నైటింగేల్ లండ‌న్‌లోని సెయింట్ థామ‌స్ ఆసుప‌త్రిలో న‌ర్సింగ్ పాఠ‌శాల‌ను స్థాపించారు. ఆధునిక న‌ర్సింగ్ విద్య‌కు పునాదులు వేసింది. ఇదే ప్ర‌పంచంలో మొట్ట‌మొద‌టి న‌ర్సింగ్ పాఠ‌శాల‌. నైటింగేల్ చేసిన సేవ‌ల‌కు గాను కొత్త‌ న‌ర్సుల‌కు నైటింగేల్ ప్ర‌తిజ్ఞ‌, ఉత్త‌మ న‌ర్సుగా సేవ‌లు అందించినవారికి ఆమె గౌర‌వార్థం ఫ్లోరెన్స్ నైటింగేల్ మెడ‌ల్‌ని బ‌హుక‌రిస్తారు. ఈ దినోత్సవాన్ని ప్ర‌పంచ‌వ్యాప్తంగా అంద‌రూ ఘ‌నంగా జ‌రుపుకుటారు.*

*🖊️నైటింగేల్ అద్భుతమైన బహుముఖ రచయిత. ఆమె జీవితకాలంలో, ఆమె ప్రచురించిన రచనలలో ఎక్కువ భాగం వైద్య పరిజ్ఞానాన్ని వ్యాప్తి చేయడానికి సంబంధించినవే. సాహిత్య నైపుణ్యాలు తక్కువగా ఉన్నవారికి సులభంగా అర్థమయ్యేలా సాధారణ ఆంగ్లంలో రాశారు.*

0 comments:

Post a Comment

Recent Posts