Friday, 29 May 2020

Important Events on May 29

🌎 *చరిత్రలో ఈ రోజు*


🔴 *ప్రత్యేక  దినాలు*

🚩 *మౌంట్ ఎవరెస్టు దినోత్సవం.*

🚩 *అంతర్జాతీయ శాంతి పరిరక్షకుల దినోత్సవం.*

🚩 *మే 29న ‘ప్రపంచ జీర్ణ ఆరోగ్య దినం (World Digestion Health day)*
[ప్రతి ఒక్కరూ వారు తీసుకునే ఆహారం విషయంలో జాగ్రత్తలు పాటించడం ఎంతో ముఖ్యం. మన ఆరోగ్యం మన చేతుల్లోనే వుంది.'_
ముఖ్యంగా మనిషి ఆరోగ్యం జీర్ణ వ్యవస్ధపై ఆధారపడి ఉంటుంది. కొవ్వు పదార్ధాలు కాకుండా, ఎక్కువగా పీచు కలిగిన ఆహార పదార్ధాలను తీసుకోవాలి. తద్వారా జీర్ణ క్రియ సమస్యలు మటుమాయం అవుతాయి’ అని డాక్టర్లు తెలియజేస్తున్నారు.
గుండె, ఎముకల ఆరోగ్యం, శరీరంలోని మిగిలిన భాగాల ఆరోగ్యాన్ని కాపాడుకోవడం వెనుక జీర్ణ వ్యవస్ధ పనితీరు చాలా ముఖ్యమన్నారు.
జీర్ణ వ్యవస్ధలో వచ్చే మార్పుల ద్వారా గ్యాస్ట్రోఇంటెస్టినల్‌ సమస్యల వల్ల గుండె మంట, కడుపు నొప్పి, అతిసారం, కడుపు ఉబ్బరం, వికారం, వాంతులు కలుగుతాయని చెప్పారు.
తినే ఆహారంపైనే ఆరోగ్యం ఆధారపడి ఉంటుందని, కొన్ని సార్లు తినే వస్తువులు ఉదర నాళం అసౌకర్యాలకు దారి తీస్తుందని చెప్పారు.
చిరు తిండ్లు, ఘాటైన ఆహారం అధిక కెఫిన్‌, పంచదార సేవనం, తదితర అనారోగ్యకరమైన ఆహారం వల్ల ఉదర నాళంలో సమస్యలు వస్తాయన్నారు.
అధిక కొవ్వుతో కూడిన ఆహారం తీసుకోవడం వల్ల పేగుల గీతలలో మార్పులు కలిగించి ఉదర నాళంలో కణితులు ఏర్పడేందుకు కారణమవుతుందన్నారు.
ఎక్కువగా పీచు కలిగిన ఆహారపదార్ధాల ను తీసుకోవాలని, ఐబిడి, హెమరాయ్డ్సి, మలబద్ధం కలిగిన వ్యాధులను నివారించ వచ్చని అన్నారు.
వేడిపాలు తాగ‌డం వ‌ల్ల జీర్ణ స‌మ‌స్య‌లు త‌గ్గాతాయి. అలాగే మలబద్ధకంతో బాధపడేవారు పాలని ప్ర‌తి రోజు తాగ‌డం వ‌ల్ల మంచి ఫ‌లితం ఉంటుంది.
మొత్తం మీద మన ఆరోగ్యం మన చేతుల్లో ఉండాలంటే, జీర్ణవ్యవస్థలో ప్రధానమైన కాలేయం ను జాగ్రత్త గా కాపాడుకోవాలని, అలాగే పైన తెల్పిన సూచనలు పాటిస్తే, జీర్ణ సంబంధిత ఆరోగ్యాన్ని మనం కాపాడుకోవచ్చు.]

〰〰〰〰〰〰〰〰

🏀 *సంఘటనలు*

✴ *1947*: *రెవరెండ్ జెనె రోబిన్సన్* అనే హిజ్రాని, అమెరికా లోని ఆంగ్లికన్ శాఖకు చెందిన, *ఎపిస్కోపల్ చర్చి, బిషప్* గా 2003 ఆగస్టు 3 నాడు నియమించింది. ఈ నియామకానికి, ప్రపంచవ్యాప్తంగా, మత పెద్దలు నిరసనలు తెలియచేసారు. 2003 ఆగస్టు 5 లో ఈ నియామకం అంగీకరించబడింది.
✴ *1953*: *టెన్సింగ్ నార్కే*, *ఎడ్మండ్ హిల్లరీ* లు ఎవరెస్టు పర్వతాన్ని మొదటిసారిగా ఎక్కారు. ఈ రోజును టెన్సింగ్ నార్కె తన జన్మదినంగా స్వీకరించాడు.
〰〰〰〰〰〰〰〰

🌐 *జననాలు*

❇ *1900*: *బి.ఎస్.మాధవరావు*, భౌతిక శాస్త్రవేత్త. (మ.1987)
❇ *1903*: *బాబ్ హోప్*, ప్రపంచ పేరొందిన హాస్యజీవి. (మ.2003)
❇ *1906*: *కడూర్ వెంకటలక్షమ్మ*, మైసూరు రాజాస్థానానికి చెందిన సుప్రసిద్ధ భరతనాట్య నర్తకి. పద్మభూషణ్ గ్రహీత. (మ.2002)
❇ *1917*: *జాన్ ఎఫ్ కెనడి*, అమెరికా సంయుక్త రాష్ట్రాలకు 35వ అధ్యక్షుడు. (మ.1963)
❇ *1925*: *భండారు సదాశివరావు*, రచయిత, సంపాదకుడు, ఆర్.ఎస్.ఎస్. ప్రచారకుడు. (మ.2010)
❇ *1944*: *ఇంద్రగంటి శ్రీకాంత శర్మ*, కవి, సంపాదకుడు.
❇ *1947*: *రెవరెండ్ జెనె రోబిన్సన్* అనే హిజ్రా, (అమెరికా లోని ఆంగ్లికన్ శాఖకు చెందిన బిషప్).
❇ *1952*: *అంబరీష్*, కన్నడ చలన చిత్రనటుడు, మాజీ కేంద్రమంత్రి. (మ.2018)
❇ *1980*: *ఉష* (గాయని), తెలుగు నేపథ్య గాయని.
〰〰〰〰〰〰〰〰

⚫ *మరణాలు*


◾ *1829*: *హంఫ్రీ డేవీ*, రసాయన శాస్త్రవేత్త. (జ.1778)
◾ *1928*: *కల్లూరి వేంకట రామశాస్త్రి*, తెలుగు కవి. వీరి కీర్తి జ్యోతిని శాశ్వతస్థితిలో ప్రకాశింపజేయు రచన బాలవ్యాకరణ గుప్తార్థ ప్రకాశిక. (జ.1857)
◾ *1932* : కొప్పరపు సోదర కవులు లో ఒకరైన *కొప్పరపు వేంకట సుబ్బరాయ కవి* మరణం (జ.1885).
◾ *1964*: *వఝల సీతారామ శాస్త్రి*, ప్రముఖ భాషా శాస్త్రవేత్త, సాహిత్య విమర్శకుడు, జ్యోతిష శాస్త్రపండితుడు. (జ.1878)
◾ *1972*: *పృథ్వీరాజ్ కపూర్*, హిందీ సినిమానటుడు. దాదా సాహెబ్ ఫాల్కే అవార్డు గ్రహీత. (జ.1906)
◾ *1975*: *నూతలపాటి గంగాధరం*, కవి, విమర్శకుడు. (జ.1939)
◾ *1987*: *పి.పుల్లయ్య*, మొదటి తరానికి చెందిన తెలుగు సినిమా దర్శకుడు, నిర్మాత. (జ.1911)
◾ *1987*: *చరణ్ సింగ్*, భారత దేశ 5 వ ప్రధానమంత్రి. (జ.1902)
◾ *1994*: *అరిక్ హునేకర్*, తూర్పు జర్మనీ మాజీ అధినేత.
◾ *1996*: *వైద్యుల చంద్రశేఖరం*, బహురూపధారణ అనే ప్రక్రియను ప్రవేశపెట్టిన రంగస్థల నటుడు. (జ.1904)
◾ *2018*: *ముక్తా శ్రీనివాసన్*, భారతీయ చలనచిత్ర నిర్మాత, దర్శకుడు. (జ.1929)
◾ *2019*: *ఇంద్రగంటి శ్రీకాంత శర్మ* తెలుగు కవి, రచయిత, ఆకాశవాణి కళాకారుడు. 

0 comments:

Post a Comment

Recent Posts