Sunday 31 May 2020

Important Events on May 31

🌎 *చరిత్రలో ఈ రోజు*


🔴 *ప్రత్యేక  దినాలు*

🚩 *ప్రపంచ పొగాకు వ్యతిరేక దినోత్సవం.*
[ముందు నువ్వు కాల్చావంటే పొగాకు
తర్వాత నీ జీవితాన్నే కాల్చేస్తుంది మరువకు ]
[ప్రపంచవ్యాప్తంగా ప్రతి ఏ టా మే 31న ప్రపంచ పొగాకు వ్యతిరేక దినోత్సవం జరుపుకుంటారు. పొగాకు వినియోగం వల్ల ఎదురయ్యే అనర్థాలను వివరించేందుకు ప్రపంచ ఆరోగ్య సంస్థ 1988 నుంచి ఈ పొగాకు వ్యతిరేక దినోత్సవం నిర్వహిస్తోంది.
1987లో ప్రపంచ ఆరోగ్య సంస్థ నిర్వహించిన సమావేశంలో ఏప్రిల్ 7, 1988నధూమపాన రహిత దినోత్సవంగా పిలుపునిచ్చింది. ప్రపంచవ్యాప్తంగా పొగాకు వినియోగదారులను ఏప్రిల్ 7వ తేదీన 24 గంటలపాటు పొగాకు ఉత్పత్తులను వాడకుండా ఉండమని కోరింది. ప్రపంచ ఆరోగ్య సంస్థ  40వ వార్షికోత్సవం కావడంతో ఏప్రిల్ 7వ తేదీని ఎంచుకున్నారు. ఆ తర్వాతలో జరిగిన సమావేశంలో ప్రతి సంవత్సరం మే 31న ప్రపంచ పొగాకు వ్యతిరేక దినోత్సవం జరుపుకోవాలని ప్రకటించింది.

పొగాకు వల్ల కలిగే నష్టాలు: పొగాకును ఏ రూపంలో తీసుకున్నా నష్టాలే అధికం. పొగాకు శరీర అవయవాలపై తీవ్ర ప్రభావాన్ని చూపిస్తుంది. ఊపిరితిత్తులకు ముప్పు వాటిల్లి ఎంఫసియా, క్రానిక్అబ్స్ట్రక్టివ్ఫల్మనరీ డిసీజ్లాంటి ప్రమాదకరమైన వ్యాధులు సోకుతాయి. మెదడులో రక్త ప్రసరణకు అంతరాయం ఏర్పడుతుంది. గొంతు కేన్సర్, గుండెపోటు వచ్చే అవకాశం ఉంది. అంతేకాకుండా పీల్చేవారికీ కూడా ప్రమాదమే. పొగాకు వల్ల కలిగే నష్టాలను ప్రజలకు తెలియజేయడంకోసం అవగహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. ఈ అవగాహన కార్యక్రమాల ఫలితంగా భారతదేశంలో పొగతాగే వారి సంఖ్య 33.8 శాతం నుంచి 23 శాతానికి తగ్గింది.]
〰〰〰〰〰〰〰〰

🏀 *సంఘటనలు*

✴ *1970*: ప్రపంచ కప్ ఫుట్‌బాల్ పోటీలు మెక్సికోలో ప్రారంభమయ్యాయి.
✴ *1986*: ప్రపంచ కప్ *ఫుట్‌బాల్ పోటీలు* మెక్సికోలో ప్రారంభమయ్యాయి.
✴ *2002*: దక్షిణ కొరియా, జపాన్ సంయుక్తంగా నిర్వహించిన *ప్రపంచ కప్ సాకర్ పోటీలు* ప్రారంభమయ్యాయి.
〰〰〰〰〰〰〰〰

🌐 *జననాలు*

❇ *1725*: మరాఠా రాజ్య రక్షణకు, హిందూ ధర్మ పరిరక్షణకు పాటుపడిన ధీర వనిత *అహల్యా బాయి హోల్కర్* జననం (మ.1795).
❇ *1911*: *మారిస్ అలైస్*, ఆర్థికవేత్త, నోబెల్ బహుమతి గ్రహీత (మ.2010).
❇ *1930* : సుప్రసిద్ధ అమెరికన్ నటుడు, దర్శకుడు *క్లింట్ ఈస్ట్‌వుడ్* జననం.
❇ *1942* : తెలుగు సినిమా నటుడు, దర్శకుడు,నిర్మాత మరియు భారత పార్లమెంటు మాజీ సభ్యుడు *సూపర్‌స్టార్ కృష్ణ* జననం.
〰〰〰〰〰〰〰〰

⚫ *మరణాలు*


◾ *1964*: *దువ్వూరి సుబ్బమ్మ*, స్వాతంత్ర్యోద్యమంలో పాల్గొని జైలుకు వెళ్ళిన మొట్టమెదటి ఆంధ్ర మహిళ. సమాజసేవిక, స్త్రీ జనోద్ధరణకు కృషి చేసిన మహిళ. (జ.1880).
◾ *1985*: *సముద్రాల రామానుజాచార్య*, సముద్రాల జూనియర్ గా పేరొందిన తెలుగు సినిమా రచయిత (జ.1923). 🙏🏻
#TODAY_IN_HISTORY

0 comments:

Post a Comment

Recent Posts