Wednesday 3 June 2020

సెప్టెంబర్ 30 వరకు సీఎస్ నీలం సాహ్ని పదవి కాలాన్ని పొడిగిస్తూ ఉత్తర్వులు

సెప్టెంబర్ 30 వరకు సీఎస్ నీలం సాహ్ని పదవి కాలాన్ని పొడిగిస్తూ ఉత్తర్వులు

సాక్షి, విజయవాడ: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర‌ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా నీలం సాహ్ని మరో మూడు నెలలు కొనసాగనున్నారు. సీఎస్‌ పదవీకాలం పొడిగించాలంటూ రాష్ట్ర ప్రభుత్వ ప్రతిపాదనను కేంద్రం ఆమోదించింది. కరోనా నేపథ్యంలో సీఎస్‌ విధులు కీలకమైనందున పదవీ కాలం పొడిగించాలంటూ రాష్ట్ర ప్రభుత్వం కోరిన విషయం తెలిసిందే. ఈ ప్రతిపాదనపై కేంద్ర ప్రభుత్వం సానుకూలంగా స్పందిస్తూ ఈ ఏడాది సెప్టెంబర్‌ 30 వరకూ నీలం సాహ్ని పదవీ కాలాన్ని పొడిగిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. అప్పటివరకూ సీఎస్‌ సర్వీస్‌లో కొనసాగనున్నారు.


0 comments:

Post a Comment

Recent Posts