Thursday, 4 June 2020

టెక్నికల్ టీచర్స్ సర్టిఫికెట్ కోర్సు దరఖాస్తులకు ఆహ్వానం

*♦టెక్నికల్ టీచర్స్ సర్టిఫికెట్ కోర్సు దరఖాస్తులకు ఆహ్వానం*

 *🔸రాష్ట్రంలో టెక్నికల్ టీచర్స్ సర్టిఫికెట్- 42 రోజుల సమ్మర్ ట్రైనింగ్ కోర్సు- 2020లో చేరేందుకు అభ్యర్థుల నుంచి దరఖాస్తులకు ఆహ్వానిస్తున్నామని ప్రభుత్వ పరీక్షల డైరెక్టర్ ఎ. సుబ్బారెడ్డి పేర్కొన్నారు. ఈ మేరకు గురువారం విడుదల చేసిన ఒక ప్రకటనలో వివరాలు వెల్లడించారు.*

*🔹ఆసక్తి గల అభ్యర్థులు శుక్రవారం సాయంత్రం 5 గంటల నుంచి 15వ తేదీ సాయంత్రం ఐదు గంటల వరకు దరఖాస్తు చేసుకోవాలని సూచించారు.*

*🔸అభ్యర్థులు జూన్ 1 నాటికి 18 సంవత్సరాలు నిండి, 45 సంవత్సరాలు దాటనివారై ఉండాలన్నారు.*

*🔸అలాగే పదో తరగతి, తత్సమాన విద్యార్హత కలిగి ఉండాలన్నారు.*

*🔹సాంకేతిక అర్హతలకు సంబంధించి సంబంధిత ట్రేడ్ లో డైరెక్టర్ ఆఫ్ గవర్నమెంట్ ఎగ్జామినేషన్‌ జారీ చేసిన టెక్నికల్ సర్టిఫికెట్ కోర్స్ (టీసీసీ) లోయర్ గ్రేడ్ లేదా స్టేట్ బోర్డ్ ఆఫ్ టెక్నికల్ ఎడ్యుకేషన్ అండ్ ట్రైనింగ్ లేదా ఐటీఐలు జారీ చేసిన నేషనల్ ట్రేడ్ సర్టిఫికెట్ లేదా నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ హ్యాండ్లూమ్ వీవింగ్ లేదా డిపార్టమెంట్ ఆఫ్ ఇండస్ట్రీస్ అండ్ కామర్స్ జారీ చేసిన సర్టిఫికెట్ లేదా తెలుగు విశ్వవిద్యాలయం జారీ చేసిన కర్నాటక సంగీతంలో గాత్రం సర్టిఫికెట్ లేదా తత్సమాన సర్టిఫికెట్లు కలిగి ఉండాలని సూచించారు.* 


*🔸ఈ సమ్మర్ ట్రైనింగ్ కోర్సు ఈ నెల 22 నుంచి ఆగస్టు రెండో తేదీ వరకు విశాఖపట్నం, కాకినాడ, గుంటూరు, కడప,అనంతపురము సెంటర్లలో శిక్షణ ఇవ్వడం జరుగుతుందని డైరెక్టర్ ఎ. సుబ్బారెడ్డి పేర్కొన్నారు.*

0 comments:

Post a Comment

Recent Posts