Thursday 4 June 2020

Important Events on June 4

*🔥జూన్ 04న అంత‌ర్జాతీయ అమాయ‌క బాధిత పిల్లల దినోత్సవం🔥*
*👉ప్ర‌తి ఏడాది జూన్ 04న అంత‌ర్జాతీయ అమాయ‌క బాధిత పిల్లల దినోత్సవాన్ని జ‌రుపుకుంటున్నాం..*

*🌏ప్రపంచవ్యాప్తంగా శారీరిక, మాన‌సిక వేధింపుల‌కు గుర‌వుతున్న పిల్లలను గుర్తించ‌డం, వార‌నుభ‌విస్తున్న బాధ‌ల‌ను గురించి అవ‌గాహ‌న క‌ల్పించ‌డ‌మే ఈ దినోత్సవ ముఖ్యోద్దేశం. పిల‌ల్ల హ‌క్కులను ప‌రిర‌క్షించ‌డంలో యూఎన్ నిబ‌ద్దతగా వ్య‌వ‌హ‌రిస్తోంది.*

*👨‍👩‍👧‍👦పిల్లలు ఎటువంటి వేధింపులుకు గురువుతున్నారు, ఎటువంటి రాక్ష‌స‌త్వానికి గుర‌వుతున్నారు వంటి విష‌యాల పై ప్రజ‌ల‌కు అవ‌గాహ‌న క‌ల్పించ‌ట‌మే కాక స్వచ్ఛంద సంస్థలు, సామాజిక వేత్తలు పిల్ల‌లు ఎటువంటి హింస‌కు గురికాకుండా కాపాడేలా ప‌లు అవ‌గాహ‌న కార్యక్రమాలు నిర్వ‌హించేలా ఈ దినోత్స‌వం ప్రోత్సహిస్తోంది.*

*▪️ఆగ‌స్టు 19, 1982 ఇజ్రాయెల్ దురాక్రమ‌ణ కార‌ణంగా పాల‌స్తీనా, లెబ‌నీస్ దేశాల్లో హింస‌కు, దోపిడికి, రాక్ష‌సత్వానికి గురవుతున్న వేలాదిమంది పిల్ల‌ల సంఖ్యను చూసి జ‌న‌ర‌ల్ అసెంబ్లీ ఒక్క‌సారిగా నిర్ఘాంతపోయింది. దీంతో యూఎన్ వారి జ్ఞాప‌కార్థం ప్ర‌తి ఏడాది జూన్ 04న అంత‌ర్జాతీయ అమాయ‌క బాధిత పిల్ల‌ల దినోత్సవం జ‌రుపుకోవాల‌ని తీర్మానం చేసింది.
1997లో జ‌న‌ర‌ల్ అసెంబ్లీ పిల్ల‌ల హ‌క్క‌లు ప‌రిర‌క్షణ కోసం 51/77 తీర్మానాన్ని ఆమోదించింది. ప‌లు దేశాల్లో పిల‌ల్ల‌పై జ‌రుగుతున్న అమానుష‌క‌ర‌మైన హింసాత్మ‌క దాడులు, ముఖ్యంగా ఉగ్ర‌వాదుల చేతుల నుంచి పిల్ల‌ల‌ను ర‌క్షించ‌డానికి అంత‌ర్జాతీయ మాన‌వ హ‌క్కుల చ‌ట్టాల‌ను మ‌రింత ప‌టిష్టం చేసి, పిల్ల‌ల హ‌క్కుల ఉల్లంఘ‌న‌ల‌కు పాల్పడే వారి పై క‌ఠిన‌మైన చ‌ర్య‌లు తీసుకునేలా యూఎన్ గ‌ట్టి కృషి చేస్తోంది.*

*▪️2030 క‌ల్లా పిల్లలపై జ‌రుగుతున్న అన్ని ర‌కాల హింసాత్మక చర్యలు అంతం అయ్యేలా వారికి బంగారు భ‌విష్యత్తును అందించేలా ఒక నిర్ధిష్ట ల‌క్ష్యాన్ని యూఎన్ ఏర్పరిచింది. దానికోసం ప్ర‌పంచ‌దేశాలు క‌లిసిగ‌ట్టిగా కృషి చేసేలా ప‌లు అవ‌గాహ‌నా కార్య‌క్ర‌మాలు చేప‌ట్టింది.*


🗒సంఘటనలు🗒

1938: మూడవ ప్రపంచ కప్ ఫుట్‌బాల్ పోటీలు ఫ్రాన్సులో ప్రారంభమయ్యాయి.

2004: భారత లోక్‌సభ స్పీకర్‌గా సోమనాధ్ చటర్జీ పదవిని స్వీకరించాడు.

2010: జపాన్ ప్రధానమంత్రిగా నవోతో కాన్ ఎంపికయ్యాడు.

❣జననాలు

1694: ఫ్రాంకోయిస్ కేనే ప్రాచీన ఆర్థిక శాస్త్ర విభాగాలలో ఒకటైన ఫిజియోక్రటిక్ స్కూల్ స్థాపకుడు. (మ.1774)

1897: వెన్నెలకంటి రాఘవయ్య, స్వరాజ్య సంఘం స్థాపకుడు. (మ.1981)

1944: కిడాంబి రఘునాథ్, శాస్త్రవేత్త, పత్రికా సంపాదకులు. (మ.2003)

1946: ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం, తెలుగు నేపథ్య గాయకుడు, సంగీత దర్శకుడు, నటుడు.

1950: ఎస్. పి. వై. రెడ్డి, నంది గ్రూప్ ఇండస్ట్రీస్ వ్యవస్థాపకుడు, అధినేత.

1961: ఎం. ఎం. కీరవాణి, తెలుగు చలనచిత్ర సంగీతదర్శకుడు, గాయకుడు.

1984: జాతీయ ఉత్తమ నటి పురస్కార విజేత ప్రియమణి, తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ నటి.

💐మరణాలు💐
1798 : ఇటలీ లోని వెనిస్‌ కు చెందిన ఒక సాహసికుడు గియాకోమో కాసనోవా మరణం (జ.1725).


1934 : రేడియం మూలకాన్ని కనుగొన్న మహిళా శాస్త్రవేత్త మేరీ క్యూరీ మరణం (జ.1867).

1998: ఆరుద్ర, కవి, గేయ రచయిత, సాహితీవేత్త, కథకుడు, నవలారచయిత, విమర్శకుడు, పరిశోధకుడు, అనువాదకుడు ( జ.1925).

2001 : భారత దేశ ఆర్గానిక్ కెమిస్ట్రీ శాస్త్రవేత్త దర్శన్ రంగనాథన్ మరణం (జ.1941).

2001: దీపేంద్ర, నేపాల్ రాజుగా పనిచేశారు (జ.1971).

2006: బూదరాజు రాధాకృష్ణ, భాషావేత్త (జ.1932).

పండుగలు , జాతీయ దినోత్సవాలు
అంతర్జాతీయ పీడిత బాలల దినోత్సవం

0 comments:

Post a Comment

Recent Posts