Thursday, 4 June 2020

Important Events on June 5

 *🇮🇳జాతీయ దినాలు🌏*

*🌏ప్రపంఛ పర్యావరణ దినోత్సవం.*
*👉🌳ప్రతి ఏడాది జూన్ 5న ప్రపంచ ప‌ర్యావ‌రణ దినోత్సవం జ‌రుపుకుంటారు.*

*🌴ఈ పర్యావరణ దినోత్సవం ఐక్యరాజ్యసమితి జనరల్ అసెంబ్లీ 1972, జూన్ 5వ తేదీన స్థాపించింది. ప్రతి సంవత్సరము జూన్ 5న‌ ఏదైనా ఒక నిర్ణీత నగరములో అంతర్జాతీయ సమావేశము జరుగుతుంది. ప్రపంచవ్యాప్తంగా నేడు పర్యావరణంపై ప్రత్యేక దృష్టి సారించారు. 1972 సవంత్సరం జూన్ 5 వ తేదీన స్వీడన్‌లో జరిగిన అంతర్జాతీయ పర్యావరణ సదస్సు వార్షికోత్సవాన్ని ప్రపంచ పర్యావరణ దినోత్సవంగా పాటిస్తున్నారు. పర్యావరణ పరిరక్షణ అవసరాన్ని ప్రజలు, ప్రభుత్వం గుర్తించి త‌గు చ‌ర్యలు చేప‌ట్టేలా ప్రోత్సహించ‌డ‌మే ఈ దినోత్సవ ముఖ్యోద్దేశం.*

*🌲🌳1972వ సంవత్సరం నుంచి క్రమం తప్పకుండా ప్రపంచ పర్యావరణ దినోత్సవాన్ని పాటిస్తున్నారు. ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా 2005, జూన్ 5న శాన్ ఫ్రాన్సిస్కోలో అంతర్జాతీయ సమావేశాన్ని నిర్వహించారు. ఇందులో గ్రీన్ సిటీస్, "ప్లాన్ ఫర్ ది ప్లానెట్" అనే అంశాలపై విస్తృతంగా చర్చించారు. జూన్ 5, 2006లో అల్గేరియా దేశంలో, "డోంట్ డెజర్ట్ డ్రైల్యాండ్స్" అనే నినాదంతోనూ, జూన్ 5, 2007లో నార్వేలో "మెల్టింగ్ ఐస్ ఎ హాట్ టాపిక్" అనే నినాదంతో, జూన్, 2008 న్యూజిలాండ్‌లో "కార్బన్‌డయాక్సైడ్, కిక్ ద హాబిట్ టు వర్డ్స్ ఎ లా కార్బన్ ఎకానమీ" అనే నినాదంతోనూ అంతర్జాతీయ సమావేశాలు ఎన్నో నిర్వహించారు.*

*🍀మన మేధో సంపత్తితో శాస్త్ర సాంకేతిక పరిజ్ఞానాన్ని పెంపొందించుకుని, ప్రపంచవ్యాప్తంగా పలు పరిశ్రమలను నెలకొల్పుతున్నాము. ఈ పరిశ్రమలు వెదజల్లే కాలుష్యంతో కోలుకోలేనంతగా వాతావరణం కలుషితమై పీల్చే గాలి, త్రాగే నీరు, తినే ఆహారం అన్నీ కలుషితమవుతున్నాయి. మానవుడు తన స్వార్థ ప్రయోజనాల కోసం ప్రకృతి ప్రసాదించిన వనరులను అవసరానికి మించి వాడుకుంటున్నాడు. నేటి వేగవంతమైన జీవితంలో వాహన వేగం పెంచుతూ, ఇంధన కోరతకి, వాయు కాలుష్యానికి కార‌ణ‌మౌవుతోంది. కార్బన్‌మోనాక్సైడ్, కార్బన్ డై ఆక్సైడ్ లాంటి విషపూరిత వాయువులు వాతావరణంలో పరిమితికి మించి పెరగడం వల్ల క్రమంగా భూమండలం వేడెక్కుతోంది. అడవులు, జల వనరులు క్రమేపీ తగ్గిపోతున్నాయి. ఈ రకంగా, శాస్త్ర సాంకేతిక పరిజ్ఞానంతో సాధించిన పురోగతి కూడా ప్రకృతి కాలుష్యానికి కారణమవుతోంది.*

*🌳ప‌ర్యావ‌ర‌ణ ప‌రిర‌క్షణ కోసం తీసుకోవాల్సిన చ‌ర్యలు:🌴*

*☘️పర్యావరణ పరిరక్షణకు ప్రభుత్వం ప్రత్యేక కార్యాచరణ ప్రణాళికను రూపొందించాలి. ప్రభుత్వ అధికారులు, స్వచ్ఛంద సంస్థలు పర్యావరణ పరిరక్షణకు నడుం బిగించాలి. ర్యాలీలు నిర్వహించి అవగాహనా సదస్సులు ఏర్పాటు చేసి మొక్కలు పెంచేలా చర్యలు చేపట్టాలి. పర్యావరణాన్ని కాపాడేలా ప్రజల్లో చైతన్యం కలిగించాలి. ఏది ఏమైనప్పటికీ పర్యావరణాన్ని పరిరక్షించాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉంది.*

*🔎సంఘటనలు🔍*

🏵️1968: అమెరికా సెనేటరు రాబర్ట్ ఎఫ్. కెన్నడీపై సిర్హన్ సిర్హన్ అనే వ్యక్తి కాల్పులు జరిపాడు. ఈ సంఘటన లాస్ ఆంజిల్స్‌లోని ది అంబాసిడర్ హోటల్లోని వంటశాలలో జరిగింది.

🏵️1972: స్వీడన్ రాజధాని స్టాక్‌హోంలో మొట్టమొదటి పర్యావరణ సదస్సు నిర్వహించబడింది.

🏵️1995 : "బోస్-ఐన్‌స్టీన్ కండెన్సేట్"ను మొదటి సారి సృష్టించారు.

🏵️2008: 3000 మీటర్ల పరుగులో సురేంద్రసింగ్ భారత జాతీయ రికార్డు సృష్టించాడు. 16 సంవత్సరాల బహదూర్ ప్రసాద్ రికార్డు ఛేదించబడింది.

*❣️జననాలు❣️*
💘1908: రావి నారాయణరెడ్డి, కమ్యూనిస్టు నాయకుడు, తెలంగాణ పోరాటంలో ముఖ్యుడు. (మ.1991)

💘1934: చెన్నుపాటి విద్య, భారత పార్లమెంటు సభ్యురాలు, సంఘ సేవిక.

💘1941: ఆచార్య ఎస్వీ రామారావు, పి.హెచ్.డి. పరిశోధనా పర్యవేక్షకుడిగా కూడా మంచి పేరు సంపాదించుకున్నాడు. ఇతని పర్యవేక్షణలో 19 పి.హెచ్.డి పరిశోధనలు, 15 ఎం.ఫిల్ పరిశోధనలు జరిగాయి.

💘1943: రాయపాటి సాంబశివరావు, భారత పార్లమెంటు సభ్యుడు.

💘1961: రమేశ్ కృష్ణన్, భారత టెన్నిస్ క్రీడాకారుడు.

💘1968: మూరెళ్ల ప్రసాద్, తెలుగు సినిమా ఛాయాగ్రాహకుడు. ఇతడు ఎక్కువగా తెలుగు, కొన్ని తమిళ సినిమాలకు పనిచేశారు.

💘1976: రంభ (నటి), తెలుగు సినిమా నటి.

*💐మరణాలు💐*

🌺1973: మాధవ్ సదాశివ్ గోల్వాల్కర్, గురూజీగా ప్రసిద్ధి చెందిన హిందుత్వ నాయకుడు (జ.1906).

🌺1996: ఆచార్య కుబేర్‌నాథ్ రాయ్, భారతీయ రచయిత, జ్ఞానపీఠ పురస్కర గ్రహీత (జ.1933).

0 comments:

Post a Comment

Recent Posts