ఇండియన్ ఆర్మీ 10+2 టెక్నికల్ ఎంట్రీ స్కీమ్- 2020 నోటిఫికేషన్
దీనిద్వారా అర్హత కలిగిన అభ్యర్థులను ఎంపిక చేసి.. ఉన్నత స్థాయి విద్య, శిక్షణ ఇచ్చి ఆర్మీలోని ఉన్నత స్థాయి ఉద్యోగాలలో పనిచేసే అవకాశాన్ని కల్పిస్తోంది. తాజాగా ఇండియన్ ఆర్మీ 10+2 ఎంట్రీ స్కీమ్ 2020కు నోటిఫికేషన్ విడుదల చేసింది. ఇంటర్ అర్హతతో ఆర్మీలో ఉద్యోగం చేపట్టేందుకు ఆసక్తి కలిగిన అభ్యర్ధుల నుంచి దరఖాస్తులు కోరుతోంది.
మొత్తం పోస్టుల సంఖ్య : 90
కోర్సు: 10+2 టెక్నికల్ ఎంట్రీ స్కీమ్
అర్హతలు:
- ప్రభుత్వ గుర్తింపు పొందిన బోర్డు నుంచి 10+2/ఇంటర్మీడియెట్ ఫిజిక్స్, కెమిస్ట్రీ, మ్యాథ్స్ సబ్జెక్టుల్లో 70శాతం మార్కులతో ఉత్తీర్ణత సాధించాలి.
- జూలై 2, 2001 నుంచి జూలై 1, 2004 మధ్య జన్మించి ఉండాలి. అభ్యర్థి 16 1/2 ఏళ్ల నుంచి 19 1/2 మధ్య వయసు కలిగి ఉండాలి.
ఎంపిక ప్రక్రియ: షార్ట్‌లిస్టింగ్ ద్వారా ఇంటర్వ్యూలను నిర్వహిస్తారు. ఎంట్రీ స్కీమ్‌లో ఎంపికైన అభ్యర్థులకు మొత్తం ఐదేళ్ల పాటు శిక్షణ ఉంటుంది. ఇందులో బేసిక్ మిలిటరీ ట్రైనింగ్, టెక్నికల్ ట్రైనింగ్ ఉంటాయి.
స్టైపెండ్: రూ.56,000
దరఖాస్తు విధానం: ఆన్‌లైన్ విధానంలో దరఖాస్తు చేసుకోవాలి.
దరఖాస్తు ఫీజు: అభ్యర్థులకు ఎటువంటి దరఖాస్తు ఫీజు లేదు.
దరఖాస్తులకు చివరి తేది: సెప్టెంబర్ 9, 2020.
పూర్తి సమాచారం కొరకు క్లిక్ చేయండి:
0 comments:
Post a Comment