12% వడ్డీ మే0 ఆశించలేదు
*♦తీర్పును పునఃసమీక్షించాలని హైకోర్టును కోరతాం*
*♦ప్రభుత్వ ఉద్యోగుల సంఘం నేత వెంకట్రామిరెడ్డి*
*🌻అమరావతి, ఆగస్టు 13(ఆంధ్రజ్యోతి):* కరోనా నేపథ్యంలో ప్రభుత్వం కోతపెట్టిన వేతనాలను రెండు నెలల్లో 12శాతం వడ్డీతో కలిపి చెల్లించాలన్న హైకోర్టు తీర్పుపై ఏపీ గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఫెడరేషన్ అధ్యక్షుడు వెంకట్రామిరెడ్డి అభ్యంతరం వ్యక్తం చేశారు. కరోనా కాలంలో తాము పని చేసినా చేయకపోయినా ప్రభుత్వం జీతాలు చెల్లిస్తుంటే... ఇబ్బందుల కారణంగా వాయిదా వేసిన మొత్తానికి 12 శాతం వడ్డీతో తీసుకోగలమా అని ప్రశ్నించారు. ఇలాంటి తీర్పును తామెన్నడూ కోరలేదని వెంకట్రామిరెడ్డి ఒక ప్రకటనలో తెలిపారు. ఈ విషయంపై కమిటీలో చర్చించి అప్పీల్‌కు వెళ్తామన్నారు. మార్చి, ఏప్రిల్ నెలల వేతనం, పెన్షన్‌లో కోత పెట్టడంపై ఒక రిటైర్డ్ న్యాయాధికారిణి పిటిషన్ వేయడంతో వడ్డీతో సహా చెల్లించాలని హైకోర్టు ఆదేశించిన విషయం తెలిసిందే. ఈ తీర్పుపై వెంకట్రామిరెడ్డి అభ్యంతరం వ్యక్తం చేశారు. ప్రభుత్వ ఉద్యోగ సంఘాలతో చర్చించిన తర్వాతే 50శాతం జీతాన్ని వాయిదా వేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుందన్నారు. ఈ విషయాన్ని కోర్టు దృష్టికి తీసుకెళ్లి తీర్పును పునఃసమీక్షించాలని కోరతామని వెంకట్రామిరెడ్డి చెప్పారు.
0 comments:
Post a Comment