నెలకు 141 రూపాయలు చెల్లించండి జియో ఫోన్ -2 ని పొందండి
▪️వాట్సాప్, యూట్యూబ్ ఈ Jio ఫోన్ లో పని చేస్తాయి...
ఆఫర్లకైనా.. ఆకట్టుకోవడానికైనా రిలయన్స్ జియో శైలియే వేరు.. అన్ని ఉచితమంటూ టెలికం మార్కెట్‌లో అడుగుపెట్టి.. ప్రత్యర్థులకు చుక్కలు చూపించిన ఆ సంస్థ... టారీప్ అమలు చేసినా.. కస్టమర్ల ఆధరణ మాత్రం ఏమాత్రం కోల్పోలేదు.. ఇక, తన కస్టమర్ల కోసం చౌకగా స్మార్ట్‌ఫోన్లను కూడా అందుబాటులోకి తెచ్చింది జియో.. ఇప్పటికే జియో ఫోన్లు మంచి సేల్స్ సాధించగా.. ఇప్పుడు జియో ఫోన్ 2 విడుదల చేసింది... 2.4-అంగుళాల డిస్‌ప్లే మరియు డ్యూయల్ - సిమ్ సపోర్ట్ చేస్తుంది. ఇందులో 4G VoLTE స్లాట్ లో జియో సిమ్ ని మాత్రమే వాడాల్సి వుంటుంది, దీనితో పాటుగా 2జి స్లాట్ తో ఇతర ఆపరేటర్ సిమ్ ని వాడుకునే వెసులుబాటు కల్పించింది. 512 ఎంబీ ర్యామ్, 4 జీబీ అంతర్గత స్టోరేజ్ దీని సొంతం కాగా..
ఎక్కువ స్టోరేజి కోసం మైక్రో ఎస్డీ కార్డు స్లాట్ కూడా తీసుకొచ్చింది. దాని ద్వారా 128జీబీ వరకు స్టోరేజి విస్తరించుకునే వీలు ఉంటుంది.
జియో ఫోన్ తర్వాత రిలయన్స్ జియో తీసుకొచ్చిన రెండో మరియు బెస్ట్ ఫీచర్ ఫోన్ ఈ జియో ఫోన్ 2, ఈ ఫోన్, ఫీచర్ అయినా కూడా స్మార్ట్ ఫోనుకు ఏ మాత్రం తీసిపోదనే చెప్పాలి. 4G టెక్నాలజీ దీని సొంతం కాగా.. వాట్సాప్, యూట్యూబ్, ఫేస్ బుక్ వంటి యాప్స్ కూడా వాడుకోవచ్చు. వాస్తవానికి, ఈ ఫీచర్ ఫోన్ ధర రూ. 2,999 రూపాయలు.. అయితే, నెలకు కేవలం 141 రూపాయల ఈఎంఐతో కూడా ఈ ఫోన్ మీ సొంతం చేసుకోవచ్చు. ఇక, ఈ ఫోన్ 2,000 ఎంఏహెచ్ శక్తిగల బ్యాటరీని కూడా కలిగి వుంది.
2 ఎంపీ రియర్ కెమేరామరియు 0.3 ఫ్రంట్ కెమెరాతో డిజైన్ చేశారు. రిలయన్స్ జియో నుంచి ఈ జియో ఫోన్ మరియు జియో ఫోన్ 2 పైన ఆకర్షణీయమైన ప్లాన్ కూడా తెచ్చింది.. రూ . 49 ప్లాన్ కింద 1జీబీ డేటా, 50 ఉచిత ఎస్ఎంఎస్, జియో నుండి జియో కి ఉచిత అన్లిమిటెడ్ కాలింగ్, .రూ .99 ప్లాన్, 14 జీబీడేటా, ఫ్రీ కాలింగ్, 300 ఎస్ఎంఎస్, రూ .153 ప్లాన్ ద్వారా, 42జీబీ డేటా, ఉచిత కాలింగ్, జీయో యాప్స్ కి యాక్సెస్, మరియు ఉచిత అపరిమిత ఎస్ఎంఎస్‌లు వాడుకోవచ్చు.. పైన పేర్కొన్న అన్ని ప్లాన్ల వ్యాలిడిటీ 28 రోజులుగా నిర్ణయించారు.
0 comments:
Post a Comment