హిందుస్తాన్ ఏరోనాటికల్స్ లిమిటెడ్ (హెచ్.ఏ.ఎల్) ఉద్యోగాల భర్తీకి మరో నోటిఫికేషన్ విడుదల చేసింది. ఇప్పటికే 2000 అప్రెంటీస్ పోస్టుల్ని భర్తీ చేసేందుకు దరఖాస్తుల్ని స్వీకరి స్తున్నది. దరఖాస్తు చే సుకోవడానికి 2020 సెప్టెంబర్ 5 వరకు అవకాశం ఉంది.
ఇక మరో నోటిఫికేషన్ ద్వారా 15 టెక్నీషియన్ పోస్టుల్ని భర్తీ చేస్తున్నది. సంబంధిత విభాగంలో డిప్లొమా పూర్తైనవారు ఈ పోస్టులకు దరఖాస్తు చేయొచ్చు.చెన్నైలోని తంబరంలో గల ఎయిర్‌ఫోర్స్ స్టేషన్‌లో హెచ్ఏఎల్ డిటాచ్‌మెంట్‌లో ఖాళీలున్నాయి.
ఈ పోస్టులకు దరఖాస్తు ప్రక్రియ ప్రారంభమైంది. అప్లై చేయడానికి 2020 సెప్టెంబర్ 7 వరకు అవకాశం ఉన్నది . మొత్తం ఖాళీలు- 15, టెక్నీషియన్ మెకానికల్- 4,టెక్నీషియన్ ఎలక్ట్రికల్- 11,దరఖాస్తు ప్రారంభం- 2020 ఆగస్ట్ 18 ... దరఖాస్తుకు చివరి తేదీ- 2020 సెప్టెంబర్ 7. విద్యార్హత- టెక్నీషియన్ మెకానికల్ పోస్టుకు డిప్లొమా ఇన్ ఇంజనీరింగ్ లేదా టెక్నాలజీ ఇన్ మెకానికల్.
టెక్నీషియన్ ఎలక్ట్రికల్ పోస్టుకు టెక్నీషియన్ ఎలక్ట్రికల్ లేదా టెక్నాలజీ ఇన్ ఎలక్ట్రికల్ లేదా ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్. వేతనం- రూ.43,100
మరిన్ని వివరాల కుhttp://www.hal-india.co.in/
0 comments:
Post a Comment