Friday 14 August 2020

ఆంధ్రప్రదేశ్ స్టేట్ ఎలిజిబిలిటీ టెస్ట్-2020 దరఖాస్తు ప్రక్రియ.నోటిఫికేషన్‌కు సంబంధించిన పూర్తి వివరాలు

 ఆంధ్రప్రదేశ్ స్టేట్ ఎలిజిబిలిటీ టెస్ట్-2020 దరఖాస్తు ప్రక్రియ ప్రారంభమైంది. యూనివర్సిటీలు, డిగ్రీ కాలేజీల్లో అసిస్టెంట్ ప్రొఫెసర్, లెక్చరర్ పోస్టులు పొందాలంటే ఏపీసెట్‌లో క్వాలిఫై కావాల్సి ఉంటుంది. 2020 డిసెంబర్ 6న ఏపీసెట్ నిర్వహించనుంది విశాఖపట్నంలోని ఆంధ్రా యూనివర్సిటీ. దరఖాస్తు ప్రక్రియ ఇవాళ ప్రారంభమైంది. అప్లై చేయడానికి 2020 సెప్టెంబర్ 19 చివరి తేదీ. అభ్యర్థులు కామర్స్, హిస్టరీ, ఎకనమిక్స్ లాంటి 30 సబ్జెక్ట్స్‌లో స్టేట్ ఎలిజిబిలిటీ టెస్ట్‌కు దరఖాస్తు చేయొచ్చు. 



ఆసక్తిగల అభ్యర్థులు https://apset.net.in/ వెబ్‌సైట్‌లో దరఖాస్తు చేయాలి.


దరఖాస్తు ప్రారంభం- 2020 ఆగస్ట్ 14

దరఖాస్తుకు చివరి తేదీ- 2020 సెప్టెంబర్ 19 (ఆలస్య రుసుము లేకుండా కేవలం రిజిస్ట్రేషన్ ఫీజుతో)

రూ.1,000 ఆలస్య రుసుము+రిజిస్ట్రేషన్ ఫీజుతో చివరి తేదీ- 2020 సెప్టెంబర్ 29రూ.2,000 ఆలస్య రుసుము+రిజిస్ట్రేషన్ ఫీజుతో చివరి తేదీ- 2020 అక్టోబర్ 9

రూ.5,000 ఆలస్య రుసుము+రిజిస్ట్రేషన్ ఫీజుతో చివరి తేదీ- 2020 అక్టోబర్ 30 (విశాఖపట్నంలో పరీక్షా కేంద్రం)

హాల్‌టికెట్ డౌన్‌లోడ్- 2020 నవంబర్ 26 నుంచి

పరీక్ష తేదీ- 2020 డిసెంబర్ 6


విద్యార్హత- సంబంధిత సబ్జెక్ట్‌లో 55 శాతం మార్కులతో మాస్టర్స్ డిగ్రీ పాస్ కావాలి. బీసీ, ఎస్సీ, ఎస్టీ, ట్రాన్స్‌జెండర్, దివ్యాంగులు 50 శాతం మార్కులతో పాసైతే చాలు.

దరఖాస్తు ఫీజు- జనరల్, ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులకు రూ.1,200. బీసీ అభ్యర్థులకు రూ.1,000. ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులు, ట్రాన్స్‌జెండర్ అభ్యర్థులకు రూ.700.


సబ్జెక్ట్స్- ఆంథ్రోపాలజీ, హిస్టరీ, కెమికల్ సైన్సెస్, కామర్స్, కంప్యూటర్ సైన్స్ అండ్ అప్లికేషన్, ఎకనమిక్స్, ఎడ్యుకేషన్, ఇంగ్లీష్, ఎర్త్, అట్మాస్ఫీరిక్, ఓషియన్ అండ్ ప్లానెటరీ సైన్స్, ఎన్విరాన్‌మెంటల్ సైన్స్, జియాగ్రఫీ, హిందీ, జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్స్, లా, లైఫ్ సైన్సెస్, లైబ్రరీ అండ్ ఇన్ఫర్మేషన్ సైన్స్, మేనేజ్‌మెంట్, మ్యాథమెటికల్ సైన్సెస్, ఫిజికల్ సైన్సెస్, ఫిజికల్ ఎడ్యుకేషన్, ఫిలాసఫీ, పొలిటికల్ సైన్స్, సైకాలజీ, పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్, సంస్కృతం, సోషియాలజీ, సోషల్ వర్క్, తెలుగు, ఉర్దూ, విజువల్ ఆర్ట్స్.

పరీక్షా కేంద్రాలు- విశాఖపట్నం, రాజమండ్రి, గుంటూరు, నెల్లూరు, అనంతపూర్, తిరుపతి, కడప, కర్నూలు.

ఈ నోటిఫికేషన్‌కు సంబంధించిన పూర్తి వివరాలను https://apset.net.in/ లేదా      



https://www.andhrauniversity.edu.in/ వెబ్‌సైట్స్‌లో తెలుసుకోవచ్చు

0 comments:

Post a Comment

Recent Posts