Tuesday, 25 August 2020

అన్‌లాక్-4లో కేంద్ర0 అనుమతించేవి ఇవే!

అన్‌లాక్-4లో కేంద్ర0 అనుమతించేవి ఇవే!



న్యూఢిల్లీ: అన్‌లాక్-4లో కేంద్ర అనుమతించే సర్వీసుల్లో లోకల్ రైళ్లు, మెట్రో సేవలు, ఆడిటోరియంలు, సింగిల్ స్క్రీన్ సినిమా థియేటర్లు ఉండే అవకాశాలున్నాయి. ఆర్థిక కార్యకలాపాల కొనసాగింపులో భాగంగా ఈ చర్యలు తీసుకునే అవకాశాలున్నట్టు విశ్వసనీయ వర్గాలు చెబుతున్నాయి.


అన్‌లాక్-4లో మరిన్ని సడలింపులను కేంద్రం ఇవ్వునుందని, అయితే ఆయా రాష్ట్ర ప్రభుత్వాల అంచనాల ఆధారంగానే రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల్లో సడలింపులు ఉంటాయని అంటున్నారు. ఇంతవరకూ, లోకల్ రైళ్లు, మెట్రో రైళ్లు, సింగిల్ థియేటర్ సినిమా హాళ్లు, ఆడిటోరియంలు, అసెంబ్లీ హాల్స్ వంటివి అనుమతించాలంటూ కేంద్రానికి పలు సలహాలు, సూచనలు అందాయి.

అయితే, వీటిని అనుమతించే విషయంలో ఇంకా కేంద్రం ఎలాంటి తుది నిర్ణయం తీసుకోలేదు.


లోకల్ రైళ్ల ట్రాన్స్‌పోర్టేషన్‌ను సెప్టెంబర్ మొదటి వారం నుంచి అనుమతించాలనే యోచనలో కేంద్రం ఉంది. సింగిల్ స్క్రీన్ హాళ్లను సామాజిక నిబంధనలతో అనుమతించేందుకు కూడా అవకాశం ఉంది. అలాగే ఆడిటోరియం, హాల్స్ విషంయంలోనూ థర్మల్ స్క్రీనింగ్, టెంపరేచర్ చెక్, సామర్థ్యం కంటే తక్కువ మందిని అనుమతించడం వంటి సామాజిక దూరం నిబంధనలు తప్పనిసరి చేయనుంది.



కేంద్ర మంత్రులు, సంబధిత శాఖలతో రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలు పంచుకునే సమాచారాన్ని బట్టి ఏ మేరకు కార్యకలాపాలను విస్తరించాలనే నిర్ణయం ఉంటుందని ప్రభుత్వ సీనియర్ అధికారి ఒకరు తెలిపారు. కాగా, స్కూళ్లు, కాలేజీలు పునఃప్రారంభించే విషయంలోనూ, వినోద పార్కులు, మల్టీ స్క్రీన్ మూవీ హాల్స్ విషయంలో ప్రభుత్వం ఇంకా దృష్టిసారించాల్సి ఉందని చెబుతున్నారు.

0 comments:

Post a Comment

Recent Posts