AP Guideline for Muharram festival:
మొహర్రం పండుగలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రకటించిన కోవిడ్-19 నిబంధనలను భక్తులు తప్పకుండా పాటించాలి అని మైనార్టీ సంక్షేమ శాఖ ముఖ్య కార్యదర్శి మహమ్మద్ ఇలియాజ్ స్పష్టం చేశారు.
ఈ నెల 20 నుంచి పది రోజుల పాటు ఈ ఆదేశాలు అమలులో ఉంటాయని ఆయన తెలిపారు. ఈ సందర్భంగా కింది నిబంధనలను పాటించాలని తెలిపారు. వీటి అమలుకు చర్యలు తీసుకోవాలని కలెక్టర్లు, విభాగాధిపతులను ప్రభుత్వం ఆదేశించింది.
పాటించాల్సిన నిబంధనలివే:
1.పీర్ల చావిడి వద్ద ముజావర్లు, ముతవల్లీలు, మేనేజింగ్ కమిటీ సభ్యులు అందరూ కలిసి 10 మందికి మించకుండా ఉండాలి.
2.చావిడి వద్ద భౌతిక దూరం పాటించాలి.
3.ప్రజలు, భక్తులకు తమ ఇళ్లలోనే పాతియా (భోజనం) అందించాలి.
4.పీర్ల చావిడి వద్ద శానిటైజర్లు ఉండాలి.
5.పీర్ల చావిడి వద్దకు దగ్గు, జలుబు, జ్వరం ఉన్న పెద్దలు, పిల్లలు రాకుండా చూడాలి.
6.చివరి 9, 10వ రోజుల్లో పది మందికి మించకుండా ఊరేగింపు చేసుకోవాలి.
7.పీర్లచావిడి వద్ద జంతు బలి, ఆర్కెస్ట్రా సంగీత బృందాలు నిషేధం.
0 comments:
Post a Comment