*నూతన పారిశ్రామిక విధానానికి ఏపీ మంత్రి వర్గం ఆమోదముద్ర వేసింది. బుధవారం సచివాలయంలో సీఎం జగన్ అధ్యక్షతన మంత్రివర్గ సమావేశం జరిగింది. 2020 నుంచి 2023 వరకు ఈ నూతన పారిశ్రామిక విధానం అమలులో ఉంటుందని ప్రభుత్వం తెలిపింది.
పెద్ద ఎత్తున నిరుద్యోగులకు ఉపాధి కల్పించే విధంగా నూతన విధానం రూపొందించినట్లు అధికారులు తెలిపారు. ఇందులో భాగంగా ఎస్సీ, ఎస్టీ, మహిళా పారిశ్రామిక వేత్తలకు పోత్సాహకం అందించనున్నారు. కేబినెట్‌లో తీసుకున్న నిర్ణయాలను మంత్రి పేర్ని నాని మీడియాకు వెల్లడించారు.
*వైఎస్ఆర్ విద్యాకానుక పథకానికి మంత్రి మండలి ఆమోదం తెలిపింది. సెప్టెంబరు 5 నుంచి ఈ పథకం అమల్లోకి రానుంది.
*అలాగే వైఎస్సార్ సంపూర్ణ పోషకాహార పథకానికి కూడా రాష్ట్ర కేబినెట్ ఆమోదం తెలిపింది. మహిళలు, శిశువులను ఉద్దేశించి చేపట్టిన ఈ పథకం సెప్టెంబర్ 1న ప్రారంభం కానుందని తెలిపారు. దీని కోసం రూ.1863 కోట్లు ఖర్చుచేస్తున్నట్టు చెప్పారు.
* అలాగే, డిసెంబర్ 1 నుంచి ఇంటింటికీ నాణ్యమైన బియ్యం పంపిణీ చేస్తామన్నారు. ఇందుకోసం రాష్ట్ర వ్యాప్తంగా 9260 వాహనాలు వినియోగించనున్నట్టు మంత్రి తెలిపారు.
*బీసీ ఫెడరేషన్లు, భావనపాడు పోర్టు డీపీఆర్‌కు మంత్రి వర్గం ఆమోదం తెలిపినట్లు చెప్పారు.
*అలాగే, గోదావరి వరద ముంపు ప్రాంతాల్లో సహాయక చర్యలపైనా కేబినెట్ చర్చించింది.
0 comments:
Post a Comment