Friday, 21 August 2020

గురు శుక్రవారం లో భారీగా తగ్గిన బంగారం ధర వెండి ధర ఢమాల్

 గురు శుక్రవారం లో భారీగా తగ్గిన బంగారం ధర వెండి ధర ఢమాల్



పెరుగుతూ వస్తున్న బంగారం ధర మళ్లీ తగ్గింది…

రెండు రోజుల్లో రూ.5వేల వరకు క్షీణించిన కిలో వెండి


న్యూఢిల్లీ: బంగారం, వెండి ధరలు తగ్గుముఖం పట్టాయి. గురువారం 10 గ్రాముల పసిడి రూ.1,492 దిగింది. దీంతో ఢిల్లీ మార్కెట్‌లో తులం విలువ రూ.52,819 వద్దకు చేరింది. బుధవారం రూ.54,311 పలికిన విషయం తెలిసిందే. వెండి ధర కూడా కిలో రూ.1,476 పడిపోయి రూ.67,924 వద్ద స్థిరపడింది. అంతకుముందు రూ.69,400లుగా ఉన్నది. బుధవారం రూ.3,112 మేర వెండి ధర పతనమైన సంగతి విదితమే. కాగా, అంతర్జాతీయ మార్కెట్‌లో ఔన్సు పుత్తడి 1,927 డాలర్లుగా ఉంటే, వెండి 26.71 డాలర్లుగా ఉన్నది. గ్లోబల్‌ మార్కెట్‌లో డాలర్‌ విలువ బలపడటం బంగారానికి మదుపరులలో డిమాండ్‌ను తగ్గించిందని ట్రేడర్లు చెప్తున్నారు.



 రెండు రోజులు తగ్గిన పసిడి ధర మళ్లీ నేడు తగ్గింది, అంతర్జాతీయ పరిస్దితుల వల్ల బంగారం ధర మరింత తగ్గుతోంది అంటున్నారు నిపుణులు, మరీ ముఖ్యంగా వెండి ధర కూడా భారీగా తగ్గుతూ వస్తోంది.


హైదరాబాద్ మార్కెట్లో బంగారం ధర తగ్గింది. శుక్రవారం 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర ఏకంగా రూ.780 తగ్గింది. దీంతో ధర రూ.55,460కు చేరింది. అదేసమయంలో 22 క్యారెట్ల బంగారం ధర కూడా తగ్గింది. 10 గ్రాముల బంగారం ధర రూ.720 తగ్గుదలతో రూ.50,840కు చేరింది.



పసిడి ధర తగ్గితే.. వెండి ధర కూడా ఇదే దారిలో ఉంది.. కేజీ వెండి ధర ఏకంగా రూ.1100 పడిపోయింది. దీంతో ధర రూ.67,000కు దిగొచ్చింది.


మార్కెట్లో షేర్ల ధరలు ర్యాలీ చేశాయి, అందుకే భారీగా బంగారం ధరలు తగ్గుతున్నాయి అంటున్నారు బులియన్ వ్యాపారులు అనలిస్టులు.


0 comments:

Post a Comment

Recent Posts