Wednesday, 19 August 2020

ప్రధాని పేరుతో నకిలీ పథకాలను ప్రచారం చేస్తున్న నకిలీ వెబ్‌సైట్స్

 ప్రధాని పేరుతో నకిలీ పథకాలను ప్రచారం చేస్తున్న నకిలీ వెబ్‌సైట్స్



కేంద్ర ప్రభుత్వ పథకం పేరుతో నకిలీ వెబ్ సైట్ నిర్వహిస్తున్న ముఠా గుట్టు రట్టు చేశారు ఢిల్లీ పోలీసులు . ఏకంగా ప్రధాని పేరుతోనే నకిలీ పత్రాలు సృష్టించి వేలమంది నుండి డబ్బులు తెలివిగా వసూలు చేస్తున్న సైబర్ నేరగాళ్ల ను గుర్తించిన పోలీసులు వారిని అరెస్టు చేశారు. వీరు నిర్వహిస్తున్న వెబ్సైట్లలో ఇప్పటివరకూ 15 వేల మంది ప్రజలు తమ పేర్లను నమోదు చేసుకున్నట్లు గా పోలీసులు వెల్లడించారు. 'ప్రధాన్ మంత్రి శిశు వికాస్ యోజన' పేరిట వివిధ వెబ్‌సైట్ల ద్వారా నకిలీ పథకాలను నిర్వహిస్తున్నముగ్గురు నిందితులను పోలీసులు అరెస్టు చేశారు.


Www.pmsvy-cloud.in అనే నకిలీ వెబ్‌సైట్ 'ప్రధాన్ పేరిట ఒక నకిలీ పథకాన్ని ప్రచారం చేస్తుందని , దాని ద్వారా ప్రజల నుండి డబ్బులు వసూలు చేస్తుందని నేషనల్ హెల్త్ అథారిటీ డైరెక్టర్ ఫిర్యాదుపై సైబర్ క్రైమ్ యూనిట్, స్పెషల్ సెల్‌లో కేసు నమోదైంది

ఈ వెబ్‌సైట్‌లో రాష్ట్ర స్థాయి నుండి పంచాయతీ స్థాయి వరకు ఏజెంట్ల ద్వారా నెట్‌వర్క్ కొనసాగుతుంది. దీనిలో 15 వేలకు పైగా రిజిస్టర్డ్ సభ్యులు ఉన్నారు. బీహార్ రాష్ట్రం పాట్నాలో నివసిస్తున్న నీరజ్ పాండే (28), ఉత్తర ప్రదేశ్ అయోధ్యలో నివసిస్తున్న ఆదర్శ్ యాదవ్ (32) అనే ఇద్దరు నిందితులను అరెస్టు చేసి పోలీసు రిమాండ్‌కు తరలించారు.


పౌరుల డేటా బేస్ దుర్వినియోగం.. ప్రజల నుండి డబ్బులు దండుకునే స్కెచ్


నమోదు చేసుకున్న పౌరుల డేటాబేస్ ఉపయోగించి ఆసుపత్రులు మరియు విద్యా రంగంలోని సంస్థల నుండి కమీషన్లు తీసుకోవాలని వారు స్కెచ్ వేశారు. ఇప్పటికే నమోదు చేసుకున్న సభ్యులకు ఇతర బోగస్ పథకాలపేరుతో వారితో చిన్న మొత్తాలలోనే డబ్బులు చెల్లించేలా చేసి మోసం చేసేందుకు కూడా ప్రణాళిక వేశారు.విచారణ సమయంలో, నిందితుడు నీరజ్ పాండే www.pmsvy-cloud.in కు మరో వెబ్‌సైట్ ఉందని వెల్లడించారు.


ముగ్గురు నిందితులను అరెస్ట్ చేసిన ఢిల్లీ పోలీసులు


పాట్నాకు చెందిన ఒక సువేందర్ యాదవ్ 'ప్రధాన్ మంత్రి శిశు వికాస్ యోజన' పేరిట పథకాలు నడుపుతున్నారని వెల్లడించారు.దీంతో పోలీసుల బృందం పాట్నాలో దాడి చేసి, 'ప్రధాన్ మంత్రి శిశు వికాస్ యోజన' పేరిట మరో వెబ్‌సైట్ నడుపుతున్న నిందితుడు సువేందర్ యాదవ్‌ను అరెస్టు చేశారు. దీంతో మొత్తం ముగ్గురు నిందితులను పోలీసులు అరెస్ట్ చేశారు .అరెస్టు చేసిన వారి నుంచి ఏడు సెల్‌ఫోన్లు, మూడు ల్యాప్‌టాప్‌లు, రెండు కంప్యూటర్లు, కొన్ని నోట్‌ప్యాడ్‌లు, చాలామందికి సంబంధించిన గుర్తింపు కార్డులను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.


పథకం ద్వారా ప్రజల నుండి నెలకు 250 రూపాయలు చెల్లింపు .. దేశ వ్యాప్తంగా ఏజెంట్స్


ఈ పథకంలో తల్లిదండ్రులు ప్రతి బిడ్డకు 250 రూపాయలు చెల్లించేవారు, అందులో రూ .50 ఏజెంట్‌కు కమీషన్, మరో రూ .50 రాష్ట్ర నిర్వాహకుడికి , జిల్లా నిర్వాహకులకు మధ్య విభజించబడింది. మిగిలిన డబ్బును ప్రధాన నిందితులు తమ ఖాతాలో వేసుకునేవారు . కేరళ, తమిళనాడు, హర్యానా, గుజరాత్, పంజాబ్, జమ్మూ కాశ్మీర్, మధ్యప్రదేశ్, కర్ణాటక, గోవా, మహారాష్ట్ర, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, రాజస్థాన్, అస్సాం, అరుణాచల్ ప్రదేశ్, మిజారా, సిక్కిం వంటి రాష్ట్రాలలో, త్రిపుర, నాగాలాండ్, హిమాచల్ ప్రదేశ్, ఉత్తరాఖండ్, ఉత్తర ప్రదేశ్ మరియు ఒడిశాలలో వారు తమ నెట్‌వర్క్‌ను విస్తరించారు.


ప్రభుత్వ పథకాలపై ఏది పడితే అది నమ్మి మోసపోకండి .. తస్మాత్ జాగ్రత్త


ఈ నకిలీ వెబ్ సైట్ ల వ్యవహారం వెలుగులోకి వచ్చిన తరువాత, ప్రభుత్వ పథకాల గురించి మరియు విశ్వసనీయమైన అధికారిక వెబ్‌సైట్ల గురించి ప్రజలు తెలుసుకోవాలని ఏ సైట్ పడితే ఆ సైట్ ను ప్రభుత్వ సైట్ గా గుర్తించకూడదని చెప్తున్నారు. ఎవరు ఏది చెప్తే అది నమ్మి మోసపోవద్దని సూచిస్తున్నారు . ఈ నకిలీ వెబ్ సైట్స్ కేసులో ఇతర నిందితులను పట్టుకోవటానికి దర్యాప్తు జరుగుతోంది.

0 comments:

Post a Comment

Recent Posts