Wednesday, 19 August 2020

కరోన వాక్సిన్ వస్తే బంగారం ధరలు భారీ పతనం.... ధర ఎంతంటే?

 బంగారం ధరలు తగ్గుముఖం పడుతున్నాయి. ముఖ్యంగా కరోనా వైరస్ దెబ్బతో అంతర్జాతీయంగా మార్కెట్లన్నీ కుదేలు అవుతున్న నేపథ్యంలో సేఫ్ ఇన్వెస్ట్ మెంట్ గా బంగారం అవతరించింది. దీంతో మదుపరులు బంగారం వైపు తమ పెట్టుబడులను మరల్చారు. ఈ నేపథ్యంలో బంగారం ధరలు కొత్త రికార్డులను తాకాయి. బంగారంలో పెట్టుబడి పెట్టిన మదుపరులు లాభాలను ఆర్జించారు. ఇదిలా ఉంటే తాజాగా రష్యాలో కోవిడ్ 19 వ్యాక్సిన్ కు అక్కడ ప్రభుత్వం ఓకే చెప్పడంతో పాటు, ఇతర వ్యాక్సిన్ లు కూడా త్వరలోనే మార్కెట్లోకి వస్తున్నాయనే వార్తలతో పసిడి ధరలు తగ్గుముఖం పట్టాయి. ఇప్పటికే 10 గ్రాముల బంగారం ధర వరుసగా రెండురోజుల్లో 3 వేలకు పైగా తగ్గింది. దీంతో మదుపుదారులు బంగారంపై ప్రాఫిట్ బుకింగ్ చేయడం విశేషం.


గ్లోబల్ మార్కెట్లలో, స్పాట్ బంగారం ఔన్స్‌కు 0.3 శాతం తగ్గి 2,021 డాలర్లకు చేరుకోగా, యుఎస్ ఫ్యూచర్స్ మార్కెట్లో ఇలాంటి శాతం పాయింట్లు తగ్గి 2,034 డాలర్లకు చేరుకుంది. యుఎస్-చైనా ఉద్రిక్తతలు పెరగడం మరియు కోవిడ్ -19 కేసులు పెరగడం ధరల తగ్గుదలకు కాస్త బ్రేక్ పడింది. ఇదిలాఉంటే బంగారం ధరలు గత మూడు నెలల్లో క్రమంగా పెరుగుతున్నాయి. గత మూడు నెలల్లో 18 శాతం పెరిగడం గమనార్హం.కరోనా కారణంగా ప్రపంచ ఆర్థిక అనిశ్చితి నేపథ్యంలో బంగారం ధరలు పెరుగుతున్నాయి.


ఆర్థిక వ్యవస్థను పునరుద్ధరించడానికి యుఎస్ ఫెడ్ ప్రకటించిన ఉద్దీపన ప్రధాన కరెన్సీలకు వ్యతిరేకంగా డాలర్ ను బలహీనపరిచింది. అలాగే ప్రపంచవ్యాప్తంగా బంగారు ధరలను పెంచింది. అయితే రష్యా ఆరోగ్య మంత్రిత్వ శాఖ మొదటి కోవిడ్ -19 వ్యాక్సిన్‌ను ఆమోదించడం కూడా బులియన్‌పై ఒత్తిడి తెచ్చిందని విశ్లేషకులు తెలిపారు. రష్యా వాక్సిన్ కనుక విజయవంతమైతే మాత్రం బంగారం ధరల పతనం మామూలుగా ఉండదని, కనీసం 10 నుంచి 15 శాతం నష్టపోవచ్చని అంచనా వేస్తున్నారు. మరోవైపు బులియన్ విశ్లేషకులు బంగారం ధరలు దిగివస్తే అటు రిటైల్ వ్యాపారంలో సేల్స్ పెరగవచ్చని అంచనే వేస్తున్నారు.

0 comments:

Post a Comment

Recent Posts