Thursday 27 August 2020

దేశంలోనే మొట్టమొదటి బహుళ వస్తువులను తీసుకెళ్లే కిసాన్ రైల్స్

 కేంద్రం 2020-21 బడ్జెట్‌లో 'కిసాన్ రైల్' అనే ప్రత్యేక పార్శిల్ రైళ్లను ప్రారంభించేందుకు ప్రణాళికలను ప్రకటించింది.


ప్రధానాంశాలు..

  1. కిసాన్ రైల్స్ మొట్టమొదటి బహుళ వస్తువులను తీసుకెళ్లే రైళ్లు.
  2. ఇంతకుముందు భారతీయ రైల్వేలు అరటి స్పెషల్స్ వంటి సింగిల్ కమోడిటీ స్పెషల్ రైళ్లను నడిపాయి.
  3. రిఫ్రిజిరేటెడ్ కోచ్‌లతో కూడిన ఈ రైళ్లు కూరగాయలు, పండ్లు వంటి పాడైపోయే వ్యవసాయ ఉత్పత్తులను తక్కువ వ్యవధిలో మార్కెట్లోకి తీసుకురావడానికి సహాయపడతాయి.
  4. వ్యవసాయ ఉత్పత్తులు దేశంలోని ఒక మూలలో నుండి మరొక మూలకు చేరుకునేందుకు ఉపయోగపడతాయి.
  5. ఈ రైళ్లు 2022 నాటికి రైతుల ఆదాయాన్ని రెట్టింపు చేసే లక్ష్యాన్ని సాకారం చేసేందుకు ఉద్ధేశించాయి.
  6. సాధారణ రైళ్ల పార్శిల్ కోసం తీసుకునేంత ఫీజునే వీటికి సుంకంగా వసూలు చేస్తుండడంతో రైతులకు ఎంతో ఉపయోగకరం అని భావిస్తున్నారు.
  7. దేవ్లాయ్-దనాపూర్ రైలు (వీక్లీ సర్వీస్) వ్యవసాయ ఉత్పత్తుల రవాణా ఖర్చులను రోడ్డు రవాణాతో పోలిస్తే టన్నుకు 1000 రూపాయలు, 15 గంటల ప్రయాణ సమయం తగ్గుతుంది.
  8. స్థానిక రైతులు, లోడర్లు, వ్యవసాయ ఉత్పత్తి మార్కెట్ కమిటీ (ఏపీఎంసీ), ఇతర వ్యక్తులు ఎక్కువగా వీటిని ఉపయోగించుకుంటున్నారు.
  9. ఏ రైతు అయినా లేదా మరే ఇతర ఆసక్తి గల వ్యక్తి అయినా సరుకుల పరిమాణంపై ఎటువంటి పరిమితి లేకుండా నేరుగా రైళ్లను సరుకుల రవాణాకు బుక్ చేసుకోవచ్చు.
  10. 50-100 కిలోల వరకు ఉండే సరుకును ఏదైనా స్టాపింగ్ స్టేషన్ నుంచి మరే స్టాపింగ్ స్టేషన్ వరకు బుక్ చేసుకునే సౌలభ్యాన్ని ఇది ఇస్తుంది.
  11. ఒక వేళ ఏ కారణం చేతనైనా ఉత్పత్తుల నష్టం జరిగితే, రైల్వేలో ఇప్పటికే ఉన్న పరిహార వ్యవస్థ ద్వారా వారు నష్ట పరిహారం పొందవచ్చు.

0 comments:

Post a Comment

Recent Posts