Thursday, 13 August 2020

గుడ్ న్యూస్... భారీగా తగ్గిన పసిడి ధర

 వరుసగా పెరుగుతూ సామాన్యుడు అందుకోనంత ఎత్తుకు దూసుకెళ్లిన బంగారం ధర క్రమంగా కిందకు దిగుతోంది. ఆల్‌టైం హై రికార్డులు సృష్టించిన పడిసి ధర.. నాలుగు రోజులుగా పడిపోతోంది... నిన్నటి వరకు వందల్లో తగ్గగా.. ఇవాళ ఏకంగా వేలల్లో పడిపోయింది. పసిడి ప్రేమికులకు శుభార్త చెబుతూ రూ.3వేలకు పైగా తగ్గింది. 



హైదరాబాద్ మార్కెట్‌లో 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర ఏకంగా రూ.3350 క్షీణించి రూ.54,680కి పడిపోగా.. 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.3010 పడిపోయివడంతో రూ.50,130కు దిగివచ్చింది. అయితే, పసిడి ధర పడిపోయినా వెండి కాస్త పైకి కదిలింది.. రూ.50 పెరగడంతో.. కిలో వెండి ధర రూ.72,550కు చేరింది.


అంతర్జాతీయ మార్కెట్‌లో బంగారం ధర తగ్గుదల ప్రభావం దేశీ మార్కెట్లపై స్పష్టంగా చూపిస్తోంది..
అంతర్జాతీయ మార్కెట్‌లో పసిడి ధర ఔన్స్‌కు 0.15 శాతం క్షీణించింది. దీంతో బంగారం ధర ఔన్స్‌కు 1944 డాలర్లకు దిగివచ్చింది.. ఇక, కొత్త రికార్డులు సృష్టించిన బంగారం ధర పడిపోయినా చాలా ప్రభావాన్ని చూపించనుంది.. 



బ్యాంకుల వద్ద ఉన్న బంగారం నిల్వలు, వడ్డీ రేట్లు, జువెలరీ మార్కెట్ పై స్పష్టంగా కనిపించనుంది. వరుసగా బంగారం ధర పెరగడంతో.. బంగారంపై ఇచ్చే రుణ పరిమితిని పెంచుతూ వచ్చాయి బ్యాంకులు.. వాటిపై కూడా ఈ ప్రభావం పడే అవకాశం ఉందంటున్నారు మార్కెట్ విశ్లేషకులు.

0 comments:

Post a Comment

Recent Posts