ఉత్తరకొరియా నియంత కిమ్ జోంగ్-ఉన్ చనిపోయాడు:రాయ్ కాలీ అనే జర్నలిస్ట్ సంచలన వ్యాఖ్యలు
పోంగ్యాంగ్: ఉత్తర కొరియా డిక్టేటర్ కిమ్ జోంగ్ ఉన్ కోమాలోకి వెళ్లినట్టు వస్తున్న వార్తలపై స్పందించిన జర్నలిస్టు ఒకరు సంచలన వ్యాఖ్యలు చేశారు. కిమ్ మృతి చెందారని, ఆయన సోదరి కిమ్ యో జోంగ్ త్వరలో దేశాన్ని ఏలబోతోందని ఆయన వ్యాఖ్యానించారు. కిమ్ కోమాలోకి వెళ్లారని తనకు సమాచారం ఉందని, అయితే, ఆయన బతికే ఉన్నారని దక్షిణ కొరియా దివంగత అధ్యక్షుడు కిమ్ డే జంగ్ సహాయకుడు చాంగ్ సాంగ్ మిన్ చేసిన వ్యాఖ్యల కలకలం ఇంకా రేగుతుండగానే, తాజాగా జర్నలిస్టు రాయ్ కేలీ చేసిన తాజా వ్యాఖ్యలు మరింత సంచలనానికి కారణమయ్యాయి.
కిమ్ ఆరోగ్యం క్షీణించిందని, గత కొన్ని రోజులుగా ఆయన బహిరంగంగా కనిపించక పోవడం ఇందుకు ఊతమిస్తోందంటూ ఇటీవల అంతర్జాతీయంగా వార్తలు హల్‌చల్ చేశాయి.
దీంతో స్పందించిన నార్త్ కొరియా.. కిమ్ ఓ అధికారిక కార్యక్రమానికి హాజరైన వీడియోను విడుదల చేసి ఆ ఊహాగానాలకు తెరదించింది.
ఇటీవల ఉత్తర కొరియాలో పర్యటించిన జర్నలిస్టు రాయ్ కేలీ తాజాగా మాట్లాడుతూ.. కిమ్ బతికి లేరని, ఆయన చనిపోయాడని విశ్వసిస్తున్నట్టు చెప్పారు. దేశంలో కార్యాచరణ పరమైన మార్పుల కారణంగా కిమ్ ఆరోగ్య పరిస్థిపై దేశంలో కొంత గందరగోళం నెలకొని ఉందని అన్నారు. ప్రజలకు విడుదలవుతున్న సమాచారం, లేదంటే తప్పుడు సమాచారం దేశంలో ఏదో జరగబోతోందన్న విషయాన్ని సూచిస్తోందని అన్నారు. కిమ్, లేదంటే ఇతర నాయకుల సమాచారాన్ని ప్రజలకు తెలియజేయడంలో దేశం ఎప్పుడూ నిర్దిష్టంగా లేదని ఆయన పేర్కొన్నారు.
ఈ సందర్భంగా రాయ్ మరో విషయాన్ని గుర్తు చేశారు. కిమ్ జోంగ్-ఇల్ చనిపోయిన విషయాన్ని కూడా అప్పట్లో కొన్ని నెలల తర్వాత ప్రకటించారని పేర్కొన్నారు. కిమ్ సోదరి కనుక అధికార బాధ్యతలు స్వీకరిస్తే ఈ విషయంలో ఓ స్పష్టత వస్తుందని అన్నారు. కాగా, రచయిత రూత్ ఏనే మోంటి ఇటీవల మాట్లాడుతూ.. కిమ్ నడిచేందుకు సాయం కావాలని సూచించారు. అధిక బరువు కారణంగా ఆయన ఆరోగ్యం అత్యంత ప్రమాదకరంగా ఉందని అన్నారు. ఈ పరిణామాలన్నీ చూస్తుంటే కిమ్‌పై వస్తున్న వార్తలు నిజమేనని అనిపించేలా ఉన్నాయని నిపుణులు చెబుతున్నారు.
0 comments:
Post a Comment