కేంద్ర ప్రభుత్వ సంస్థ లో ఉద్యోగాలు ఇంటర్ డిగ్రీ అర్హత
కేంద్ర ప్రభుత్వానికి చెందిన నేషనల్ కౌన్సిల్ ఫర్ టీచర్ ఎడ్యుకేషన్-NCTE న్యూఢిల్లీ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. అసిస్టెంట్, స్టేనోగ్రాఫర్ గ్రేడ్ సీ, స్టెనోగ్రాఫర్ గ్రేడ్ డీ, లోయర్ డివిజన్ క్లర్క్, డేటా ఎంట్రీ ఆపరేటర్ లాంటి పోస్టుల్ని భర్తీ చేస్తోంది. మొత్తం 18 ఖాళీలున్నాయి. ఇంటర్మీడియట్, డిగ్రీ పాసైనవారు ఈ పోస్టులకు అప్లై చేయొచ్చు. దరఖాస్తు చేసేముందు నోటిఫికేషన్ పూర్తిగా చదివి అర్హతలు తెలుసుకోవాలి. కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ లేదా స్కిల్ టెస్ట్ ద్వారా ఎంపిక చేస్తారు. ఈ పోస్టులకు దరఖాస్తు ప్రక్రియ ఇప్పటికే ప్రారంభమైంది. అప్లై చేయడానికి 2020 సెప్టెంబర్ 19 చివరి తేదీ. ఈ నోటిఫికేషన్‌కు సంబంధించిన పూర్తి వివరాలను https://ncte.gov.in/
వెబ్‌సైట్‌లో తెలుసుకోవచ్చు
మొత్తం ఖాళీలు- 18
అసిస్టెంట్- 3
స్టేనోగ్రాఫర్ గ్రేడ్ సీ- 3స్టెనోగ్రాఫర్ గ్రేడ్ డీ- 6
లోయర్ డివిజన్ క్లర్క్- 1
డేటా ఎంట్రీ ఆపరేటర్- 5
దరఖాస్తు ప్రారంభం- 2020 ఆగస్ట్ 20
దరఖాస్తుకు చివరి తేదీ- 2020 సెప్టెంబర్ 19
విద్యార్హతలు- వేర్వేరు పోస్టులకు వేర్వేరు విద్యార్హతలున్నాయి. ఇంటర్, డిగ్రీ. పూర్తి వివరాలు నోటిఫికేషన్‌లో తెలుసుకోవచ్చు.
దరఖాస్తు ఫీజు- అసిస్టెంట్, స్టెనోగ్రాఫర్ గ్రేడ్ సీ పోస్టుకు రూ.1250. స్టెనోగ్రాఫర్ గ్రేడ్ డీ, లోయర్ డివిజన్ క్లర్క్, డేటా ఎంట్రీ ఆపరేటర్ పోస్టుకు రూ.1000. ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులు, ఎక్స్‌సర్వీస్‌మెన్, మహిళలు, నేషనల్ కౌన్సిల్ ఫర్ టీచర్ ఎడ్యుకేషన్ ఉద్యోగులకు ఫీజు లేదు.
ఎంపిక విధానం- కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ లేదా స్కిల్ టెస్ట్.
0 comments:
Post a Comment