Wednesday, 19 August 2020

చిటికెడు పసుపు ఎంత మాయ చేస్తుందో చూడండి

 చిటికెడు పసుపు ఎంత మాయ చేస్తుందో చూడండి



ప్రస్తుతం ఉన్న బిజీ జీవితంలో అందాన్ని కాపాడుకోవడం ఒక పెద్ద సవాల్ అని చెప్పవచ్చు. దాంతో మార్కెట్లో దొరికే క్రీమ్స్ కొనేసి వాడేస్తూ ఉంటారు. ఒక్కోసారి ఇ వాటి కారణంగా సైడ్ ఎఫెక్ట్స్ వచ్చే అవకాశాలు ఉంటాయి. అలా కాకుండా కేవలం 10 నిమిషాల సమయాన్ని కేటాయిస్తే కాంతివంతమైన ముఖం మీ సొంతం అవుతుంది. మనకి ఇంటిలో ఉండే పసుపు ను ఉపయోగించి కొన్ని చిట్కాలు తెలుసుకుందాం.


ఒక స్పూన్ పసుపులో ఒక స్పూన్ నిమ్మరసం కలిపి ముఖానికి రాసి రెండు నిమిషాలు సున్నితంగా మసాజ్ చేసి అరగంటఅయ్యాక చల్లని నీటితో శుభ్రం చేసుకోవాలి. ఈ విధంగా చేసుకుంటే మొటిమలు, బ్లాక్ హెడ్స్ అన్ని తొలగిపోతాయి.


ముఖం నిర్జీవంగా మారితే ఈ చిట్కా చాలా ఎఫెక్టివ్ గా పనిచేస్తుంది.

పాలమీగడలో పసుపు కలిపి ముఖానికి రాసి అరగంటయ్యాక గోరువెచ్చని నీటితో ముఖాన్ని శుభ్రం చేసుకుంటే కాంతివంతంగా మెరిసిపోతుంది.



రెండు టీ స్పూన్ల పాలలో అర టీస్పూన్ పసుపు వేసి బాగా కలపాలి. ఈ మిశ్రమంలో దూది ముంచి ఆ దూదితో ముఖంపై రాస్తూ ఉండాలి. ఇలా ఐదు నిమిషాలపాటు చేస్తూ ఉంటే చర్మంపై ఉన్న జిడ్డు, మురికి అన్ని తొలగిపోయి ముఖం కాంతివంతంగా మెరుస్తుంది.


గంధం, పసుపు, రోజ్ వాటర్ కలిపి ముఖానికి రాసి అరగంటయ్యాక గోరు వెచ్చని నీటితో ముఖాన్ని శుభ్రం చేసుకుంటే ముఖం మృదువుగా మారుతుంది.

0 comments:

Post a Comment

Recent Posts